విడుదలకు సిద్ధంగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ మూవీపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే స్థాయిలో మేకర్స్ ప్రమోషన్స్ ను కూడా షురూ చేస్తున్నారు. ఇందు కోసం బిగ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ‘గని’(Ghani). ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. మూవీ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఎంత కష్టపడ్డాడో అందరికీ విషయం తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. ఇందుకోసం స్పెషల్ ట్రైనర్స్ ను పెట్టుకొని అటు సిక్స్ ప్యాక్, ఇటు బాక్సింగ్ లో మెళకువలను ఒంటపట్టించుకున్నాడు. మునుపటి సినిమాల కంటే ‘గని’ కోసం ఎక్కువగానే కష్టపడ్డాడు. దాని ఫలితమే ప్రస్తుతం మూవీపై భారీ అంచనాలను నెలకొల్పింది.
మరోవైపు ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేయగా... ప్రస్తుతం ప్రమోషన్స్ ను షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే సినిమా రిలీజ్ కు ఇంకాస్తా టైం ఉండటంతో మూవీ ప్రమోషన్స్ ను కాస్తా లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకార.. గని మూవీ ప్రమోషన్స్ కు మేకర్స్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
ఇందుకోసం ఈ నెల 25న రిలీజ్ కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర ప్రదర్శనలో ‘గని’ట్రైలర్ ను ప్రమోట్ చేయనున్నారు. సౌత్ లో దాదాపుగా 1000 థియేటర్లలో ఈ మూవీ ట్రైలర్ ను ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత గని టీం రెగ్యూలర్ ప్రమోషన్స్ ను షూరు చేయనున్నట్టు సమాచారం. ఏప్రిల్ 8న విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది.
