సంక్రాంతి ఫైట్: ఇక F2 కి పండగే!

First Published 12, Jan 2019, 3:53 PM IST
HUGE RESPONSE TO F2 MOVE
Highlights

టాలీవుడ్ లో సంక్రాంతి ఫెస్టివల్ ని టార్గెట్ చేసి రిలీజైన సినిమాలు ఒకదానికి మరొకటి సంబంధం లేని కాన్సెప్ట్ తో తెరకెక్కినవి. బాక్స్ ఆఫీస్ వద్ద కథానాయకుడు - పేట అనుకున్నంతగా కలెక్షన్స్ అయితే రాబట్టలేదు.

టాలీవుడ్ లో సంక్రాంతి ఫెస్టివల్ ని టార్గెట్ చేసి రిలీజైన సినిమాలు ఒకదానికి మరొకటి సంబంధం లేని కాన్సెప్ట్ తో తెరకెక్కినవి. బాక్స్ ఆఫీస్ వద్ద కథానాయకుడు - పేట అనుకున్నంతగా కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. ఇక వినయవిధేయ రామ ఓపెనింగ్స్ ను బాగానే అందుకున్నప్పటికీ డివైడ్ టాక్ వస్తుండడంతో అదే ఊపును అందుకొకకపోవచ్చు. 

అయితే ఈ భారీ ఫైట్ లో చివరగా వచ్చిన మల్టీస్టారర్ F2 కి బాగా కలిసొచ్చింది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి ముందు నుంచి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రిలీజ్ అనంతరం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రివ్యూలు కూడా పాజిటివ్ గా ఉండడంతో ఇప్పుడు అందరి చూపు వెంకీ - వరుణ్ ల వైపు మళ్లింది. 

పండగ సీజన్ లో యావరేజ్ టాక్ వచ్చినా కూడా మినిమమ్ వసూళ్లు అందుతాయి. అలాంటిది సూపర్ ఫన్ అని ప్రశంసలు అందుతుండడంతో దిల్ రాజు సినిమాకు కాసుల వర్షం కురిసినట్టే. గత ఏడాది ఈ నిర్మాత ప్రొడక్షన్ నుంచి వచ్చిన చిత్రాలు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇక ఫైనల్ గా 2019ని మంచి హిట్ తో మొదలుపెట్టాడు. 

loader