సైరాకి నయనతార తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

సైరాకి నయనతార తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాధ ఆధారంగా సైరాని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకులు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం భాద్యతలు వహిస్తున్నారు.  ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార ఎంపికైన విషయం తెలిసిందే. కాగా నాయనతార రెమ్యునరేషన్ విషయంలో షాక్ కి గురి చేస్తున్న ఉహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.


నయనతార సైరా చిత్రం కోసం ఏకంగా రూ. 3 కోట్ల పారితోషకం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చిత్రాలలలో ఇదే అత్యదిక పారితోషకం అని వార్తలు వస్తున్నాయి.మెగాస్టార్ చిరంజీవి తన హోమ్ బ్యానర్ లో నటిస్తున్నాడు కాబట్టి ఆయన రెమ్యునరేషన్ బడ్జెట్ లోకి రాదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా జగపతి బాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో నటిస్తున్నారు. దీనితో నటీ నటుల రెమ్యునరేషన్ కే ఎక్కువ బడ్జెట్ అయిపోనుంది.
మెగాస్టార్ చిరంజీవితో పలువురు హీరోయిన్లు నటించారు. చిరంజీవి సరసన అనేక మంది స్టార్ హీరోయిన్లు నటించారు. వారందరిలో సైరాలో నటించబోతున్న నయనతార అత్యధిక పారితోషకం అందుకోబోతోంది.


ఈ రికార్డు గతంలో కాజల్ పేరిట ఉండేది. ఖైదీ నెం 150 చిత్రానికి గాను కాజల్ అగర్వాల్ దాదాపు రెండు కోట్ల పారితోషకం అందుకుందట. ఆ రికార్డుని నాయనతార అధికమించిందని అంటున్నారు.

 మెగాస్టార్ నటన డాన్సుల పరంగా సరితూగగలరనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. కాగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి ధీటుగా విజయ శాంతి పారితోషకం అందుకుంది. చిరు ఆ చిత్రానికి రూ కోటి 25 లక్షలు తీసుకోగా, విజయశాంతి కోటి రూపాయలు తీసుకుందట. అప్పట్లో విజయశాంతి సంచనలం అయితే ఇప్పుడు నయనతార రికార్డు సృష్టించిందని అంటున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page