మెగాస్టార్ చిరంజీవి తనవ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాధ ఆధారంగా సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకులు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం భాద్యతలు వహిస్తున్నారు. అనేక ఉహాగానాల తరువాత ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా నాయనతార రెమ్యునరేషన్ విషయంలో షాక్ కి గురి చేస్తున్న ఉహాగానాలు ప్రచారంలో ఉన్నాయి

నయనతార సైరా చిత్రం కోసం ఏకంగా రూ. 3 కోట్ల పారితోషకం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ చిత్రాలలలో ఇదే అత్యదిక పారితోషకం అని వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి తన హోమ్ బ్యానర్ లో నటిస్తున్నాడు కాబట్టి ఆయన రెమ్యునరేషన్ బడ్జెట్ లోకి రాదు. ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ ఎక్కువగా ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా జగపతి బాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో నటిస్తున్నారు. దీనితో నటీ నటుల రెమ్యునరేషన్ కే ఎక్కువ బడ్జెట్ అయిపోనుంది.

మెగాస్టార్ చిరంజీవితో పలువురు హీరోయిన్లు నటించారు. చిరంజీవి సరసన అనేక మంది స్టార్ హీరోయిన్లు నటించారు. వారందరిలో సైరాలో నటించబోతున్న నయనతార అత్యధిక పారితోషకం అందుకోబోతోంది.

ఈ రికార్డు గతంలో కాజల్ పేరిట ఉండేది. ఖైదీ నెం 150 చిత్రానికి గాను కాజల్ అగర్వాల్ దాదాపు రెండు కోట్ల పారితోషకం అందుకుందట. ఆ రికార్డుని నాయనతార అధికమించిందని అంటున్నారు.

చిరంజీవి సరసన నటించిన హీరోయిన్లలో విజయశాంతి, రాధా, రాధిక మరియు సుహాసిని వంటి వారికి ప్రత్యక స్థానం ఉంది. వీరు మాత్రమే మెగాస్టార్ నటన డాన్సుల పరంగా సరితూగగలరనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. కాగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి ధీటుగా విజయ శాంతి పారితోషకం అందుకుంది. చిరు ఆ చిత్రానికి రూ కోటి 25 లక్షలు తీసుకోగా, విజయశాంతి కోటి రూపాయలు తీసుకుందట. అప్పట్లో విజయశాంతి సంచనలం అయితే ఇప్పుడు నయనతార రికార్డు సృష్టించిందని అంటున్నారు.