బాలీవుడ్ సూపర్ స్టార్ రన్బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్రాన్ని ఎస్ఎస్ రాజౌమళి సమర్పిస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ప్రమోషన్స్ పై మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా వైజాగ్ నుంచే ప్రారంభించనున్నారు. 

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra). రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ (Alia Bhatt) జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున(Nagarjuna), మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నా మేకర్స్. ఈ సందర్భంగా వరుస అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

విడుదల సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా మేకర్స్ ప్రమోషన్స్ ను ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 31న ప్రమోషన్స్ లో భాగంగా ప్రత్యేకమైన ప్రారంభం కోసం విశాఖపట్నం నగరాన్ని సందర్శించనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరక్కెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగులో "బ్రహ్మాస్త్రం" మొదటి మోషన్ పోస్టర్‌ను డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగానే ప్రదర్శించారు. ప్రస్తుతం చిత్రబృందం విశాఖపట్నం సందర్శించి సినిమా విడుదల దిశగా ప్రయాణం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ రాజమౌళి కూడా పాల్గొంటున్నారు. 

వైజాగ్ సందర్శన సందర్భంగా.. రన్బీర్ కపూర్, అయాన్ మరియు ఎస్.ఎస్.రాజమౌళి ప్రఖ్యాతి గాంచిన మరియు చారిత్రాత్మకమైన సింహాచలం దేవాలయాన్ని దర్శించుకొనున్నారు. ఆ తరువాత ఉదయం 9 గంటలకు వైజాగ్ లోని విమాన్ నగర్ లోని ఎయిర్ పోర్ట్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ‘ఐకానిక్ మెలోడీ థియేటర్‌’లో అభిమానులను కలవనున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే థియేటర్ లో వారిని కలవాలంటే మాత్రం రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

2022 లో రిలీజ్ కాబోతున్న అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాల్లో "బ్రహ్మాస్త్రం" సినిమా కూడా ఒకటి, ఈ సినిమా కోసం సినీప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోషన్ పోస్టర్ నుండి "కుంకుమల" టీజర్ వరకు అన్ని ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 9 గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హిందీతోపాటు తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. 

Scroll to load tweet…