వీళ్లిద్దరి మధ్యా చెడిపోయిందా...

వీళ్లిద్దరి మధ్యా చెడిపోయిందా...

వైజాగ్ లో నిర్వహించిన ఆడియో ఫంక్షన్ లో నాగార్జున, విక్రమ్ కుమార్ చాలా హ్యాపీగా వున్నట్లు కనిపించారు. అంతే కాదు.. తదుపరి నాగచైతన్యతో.. సినిమా చేయాలని నాగార్జున విక్రమ్ కు ఆఫర్ కూడా ఇచ్చాడు.  ఇలా విక్రమ్‌ కుమార్‌తో 'హలో' తర్వాత మరో చిత్రం కూడా నిర్మిస్తానని నాగార్జున ప్రకటించడంతో విక్రమ్ కూడా సరేనన్నాడు. అయితే నాగచైతన్యతో విక్రమ్‌ కుమార్‌ సినిమా వుంటుందంటూ నాగ్‌ చెప్పడమే కాకుండా చేస్తున్నానని చెప్పమని విక్రమ్‌ కుమార్‌ని కూడా మొహమాటపెట్టటంతోనే తలూపాడని టాక్ వినిపిస్తోంది.

 

మాట వరసకి నవ్వేస్తున్నా కానీ నాగార్జునతో మళ్లీ పని చేయడానికి విక్రమ్‌ కుమార్‌ ఆసక్తిగా లేడని తెలుస్తోంది. మనం టైమ్‌లో నాగార్జునతో ఎలాంటి ఇబ్బందులు రాకపోయినా కానీ హలో చిత్రానికి మాత్రం నాగార్జున జోక్యం ఎక్కువగానే వుందట. బడ్జెట్‌ లెక్కల దగ్గర్నుంచి సినిమా తీస్తోన్న విధానం వరకు అన్నిట్లోను కలగజేసుకోవడంతో మధ్యలో విక్రమ్‌ కుమార్‌ కొంతకాలం నిరసన కూడా తెలిపాడట. అయితే తర్వాత బేధాభిప్రాయాలు తొలగిపోయి సినిమా పూర్తి చేసారు. హలో అవుట్‌పుట్‌ చూసిన నాగార్జున ఆనందంతో విక్రమ్‌ని అభినందించి మళ్లీ మనం కలిసి పని చేయాలని అన్నాడట.

 

విక్రమ్‌ కుమార్‌ మాత్రం ఇంకా దీనిపై ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదని, ఒకవేళ చేయాల్సి వస్తే కనుక నాగార్జున నిర్మాణంలో కాకుండా బయటి బ్యానర్లో చేయాలని డిసైడ్‌ అయ్యాడట. మరి హలో రిలీజ్‌ తర్వాత అయినా ఈ సమస్యలు సర్దుకుని ఇద్దరూ కలిసిపోతారేమో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page