హలో మూవీ ఒక్క రోజు ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..షాకింగే

huge expenditure for akhil hello movie fights
Highlights

  • అఖిల్ హీరోగా హలో మూవీ
  • అన్నపూర్ణ స్టూడియోస్ బ్యేనర్ పై నాగార్జున
  • ఫైట్స్ కోసం 25 కోట్లు ఖర్చు

అఖిల్ సినిమాపై గంపెడాశలు పెట్టుకున్నా... అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ బెడిసికొట్టింది. దాంతో తండ్రి నాగార్జున తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే తాజాగా అఖిల్ హీరోగా చేస్తున్న హలో మూవీలో తన కొడుకుని తెరపై ఎలా చూడాలనుకొంటున్నారో ఆ విధంగానే అఖిల్‌ను హల్లో చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు.

 

అఖిల్‌కు భారీ సక్సెస్‌ను అందించాలని తాపత్రయంతోనే ఈ చిత్రాన్ని కోట్లు ఖర్చుపెట్టి రూపొందించానని ఇటీవల  పేర్కొన్నారు. తెలుగు తెర మీద చూడని యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు. అవి అందరినీ థ్రిల్లింగ్‌కు గురిచేస్తాయి అన్నారు. అఖిల్ పై భారీగా చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ కోసం దాదాపు రూ.25 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్లను రప్పించారు. భారీగా రెమ్యునరేషన్, సకల సౌకర్యాలు ఇవ్వడమే కాకుండా వారికి షూటింగ్ కోసం ప్రైవేట్ జెట్ సౌకర్యాలు ఏర్పాటు చేశారట.


టాలీవుడ్‌లో ఇప్పటివరకు చేయని విధంగా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి అని చిత్ర యూనిట్ చెప్తోంది. డేర్ డెవిల్ యాక్షన్ సీన్లను రూపొందించడానికి సుమారు 80 మంది స్టంట్ మాస్టర్లను ఉపయోగించుకొన్నారట. యాక్షన్ సీన్లు ఊపిరి బిగిబట్టి చూసే విధంగా ఉంటాయి అని వారు పేర్కొంటున్నారు.

 

చిత్రంలోని యాక్షన్ సీన్లు హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా ఉంటాయి. కొన్ని సీన్లలో జాకీ చాన్ ఫైట్స్‌ను మరిపించే విధంగా అఖిల్ ఫైట్స్ చేశాడు అని నాగార్జున వెల్లడించారు. ఈ చిత్రం గురించి అనేక వివారాలు వెల్లడిస్తూ డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల అవుతున్నది అని పేర్కొన్నారు.

 

ఒకరోజులో జరిగే ప్రేమ కథనే ఈ మూవీ స్టోరి. చిన్నతనంలో స్నేహితులుగా ఉండే యువతి, యువకుడు 15 ఏళ్ల తర్వాత కలుసుకోవడమే ఈ చిత్ర కథ అని నాగార్జున వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జరిగే కథలో అనేక మలుపులు, ఆసక్తికరమైన పజిల్స్ ఉంటాయి. దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది అని నాగార్జున వెల్లడించారు.

loader