మెగా హీరో రాంచరణ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.  మంగళవారం ఉదయం తనకు పాజిటివ్‌ వచ్చినట్టుగా  రామ్‌ చరణ్‌ ప్రకటించారు.తాజాగా కరోనా టెస్టు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. హో క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తనను కలిసి వారు టెస్ట్ చేయించుకోవాలని రామ్ చరణ్ కోరారు. ఈ నేపధ్యంలో ఆయన భార్య ఉపాసన సైతం ఆయనతో క్వారంటైన్ లో గడుపుతున్నారు. ఈ మేరకు ఆమె ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ పెట్టారు.

ఆ పోస్ట్ లో రామ్ చరణ్‌తో తాను క్వారంటైన్‌లో ఉన్నానంటూ ఉపాసన చెప్పారు. ఈ గడ్డుకాలం కూడా గడిచిపోతుంది.. 2021లో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.. కరోనా లక్షణాలేవీ కనిపించడం లేదు.. ఆయన స్ట్రాంగ్‌గా ఉన్నాడు.. నాకు కూడా పాజిటివక వచ్చే అవకాశం ఉంది.. పరీక్షలు చేస్తే మాత్రం నెగెటివ్ వచ్చిందంటూ ఉపాసన అన్నారు. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫొటోలాంటి వీడియో వైరల్ అవుతోంది. అభిమానులు..ఆమె క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ రాస్తున్నారు.
 
తాజాగా మెగా ఫ్యామిలీ లో మరో హీరో కరోనా బారిన పడ్డాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. తనకు కోవిడ్ 19 పాజిటివ్‌ వచ్చినట్టుగా వరుణ్ తేజ్‌ స్వయంగా వెల్లడించాడు. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని వరుణ్‌ తేజ్‌ తెలిపాడు . ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో  ఉన్నట్టు తెలిపాడు వరుణ్ . చరణ్ ఇచ్చిన క్రిస్మస్‌ పార్టీలో పాల్గొన్న వరుణ్ తేజ్‌ పాల్గొన్నారు .