బాలీవుడ్ కి ఎందులో కూడా తక్కువా కాదు అన్నట్లు టాలీవుడ్ సరికొత్త అడుగులు వేస్తోంది. ప్రతిసారి మన స్టార్ హీరోల సినిమాలు నార్త్ హీరోల కంటే ఓ మెట్టు పైకి ఎక్కుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం మహర్షి సినిమా బాలీవుడ్ గట్టి షాకులనే ఇస్తోంది.

సినిమాపై ఎలాంటి క్రేజ్ నెలకొందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట్లో సినిమాకు అనుకున్నంత బజ్ రాలేదని టాక్ వచ్చింది. అయితే ప్రీ రిలీజ్ అనంతరం ట్రైలర్ ను ఆకట్టుకునే విధంగా రిలీజ్ చేయడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ మంది ఎదురుచూస్తున్న చిత్రాల్లో మహర్షి టాప్ లో ఉంది.
ఫెమస్ ఆన్లైన్ డేటాబేస్ వెబ్ సైట్ ఐఎండీబీ (IMDB) కూడా ఇదే విషయాన్నీ ధ్రువీకరించింది. మహర్షి సినిమాపై 30 శాతం మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.బాలీవుడ్ లో ఈ వారం మంచి బజ్ ఉన్న చిత్రాలే రిలీజ్ అవుతున్నాయి. టైగర్ ష్రాఫ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాపై 20 శాతం మంది ఆసక్తి చూపిస్తుండగా అజయ్ దేవగన్ 'దే దే ప్యార్ దే' సినిమాను 14 శాతం మంది లైక్ చేస్తున్నారు.
దీన్ని బట్టి మహర్షి రేంజ్ ఏ స్థాయికి చేరిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అమెరికాలో కూడా మహేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. డిజాస్టర్ సినిమాలు కూడా అక్కడ 1 బిలియన్ డాలర్స్ ని రాబడతాయి. ఇప్పుడు మహర్షికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అక్కడ కూడా పాత రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని చెప్పవచ్చు.