సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ని ఒకే తెరపై చూడాలని కోట్లాది మంది భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. అయితే వారు నటిస్తున్న అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల ఇంట్రడక్షన్ కోసం దర్శకుడు రాజమౌళి భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మొత్తంగా 350 కోట్ల లోపు ఫినిష్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్న జక్కన్న ఇంట్రడక్షన్ సీన్స్ కోసం 40 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడట. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కోసం 25 కోట్లు.. రామ్ చరణ్ సీన్ కోసం దాదాపు 15కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంటర్వెల్ సీన్ కోసం ఇద్దరి హీరోలకు సంబందించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారు. 

దాని కోసం 45కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్.  ఇక ఇప్పుడు స్టార్ హీరోల పరిచయ సన్నివేశాల కోసం బడ్జెట్ లో సగం అమౌంట్ ఎగిరిపోతోంది. మరి ఆ సీన్స్ అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయో చూడాలి. డివివి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.