కన్నడ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టంట్ హుచ్చ వెంకట్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. రెండు రోజుల క్రితం కొడగులో తనవైపు ఎందుకు వింతగా చూస్తున్నారంటూ ఇతరుల కారు అద్దాలను వెంకట్ ధ్వంసం చేశాడు.

దీంతో స్థానికులు అతడిని చితకబాదారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మండ్య నగరానికి వచ్చి ఒక హోటల్ లో దిగిన హుచ్చ వెంకట్ ఆదివారం ఉదయం మరోసారి పిచ్చిగా ప్రవర్తించాడు. హోటల్ ముందు నిలిపి ఉన్న గుర్తు తెలియని కారు అద్దాలను పగలగొట్టాడు వెంకట్.

తన పిచ్చి ప్రవర్తనతో షాక్ అయిన కారు యజమాని హుచ్చ వెంకట్ మీద దాడికి దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హుచ్చ వెంకట్ ని తీసుకొని వెళ్లారు.