ఇండియన్ సినిమాలు క్రమంగా ప్రపంచ స్థాయిని అందుకుంటున్నాయి. ఇండియన్ సినిమాల మార్కెట్ ని డామినేట్ చేసే బాలీవుడ్ చిత్రాల ప్రభావం ఇటీవల తగ్గింది. బాహుబలి, కేజిఎఫ్, అర్జున్ రెడ్డి లాంటి ప్రాంతీయ భాషా చిత్రాలు బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా నిలిచాయి. బాలీవుడ్ లో కూడా కొందరు హీరోలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

సూపర్ హీరో హృతిక్ రోషన్ చిత్రాలు ఇతర బాలీవుడ్ హీరోల సినిమాల కంటే భిన్నంగా ఉంటాయి. హృతిక్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలసి ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 'వార్' అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. 

ఈ చిత్రం గురించి బయటకు వస్తున్న ఒక్కో విషయం ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ ఇండియన్ సినిమాలోనే తొలిసారి గ్యాట్లింగ్ గన్ ఉపయోగించాడు. టైగర్ ష్రాఫ్, హృతిక్ మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ కాలు చెదిరే విధంగా ఉండవుతున్నాయట. 

తాజాగా చిత్ర యూనిట్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ అందించింది. ఆస్ట్రేలియాలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. హృతిక్ రోషన్ ని టైగర్ ష్రాఫ్ ఛేజ్ చేసే సీన్స్ లో ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో చిత్రీకరిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని 7 దేశాలలో, 15 ప్రధాన నగరాలలో చిత్రీకరించినట్లు ప్రకటించారు. హృతిక్ రోషన్ ని టైగర్ ష్రాఫ్ అందుకు వెంటాడుతున్నాడు అనే ఆసక్తికర అంశాలు సినిమా చూసి తెలుసుకోవాలి.