విడాకులు తీసుకున్న స్టార్ హీరో.. మరోసారి భార్యతో పెళ్లికి రెడీ?

Hrithik Roshan-Sussanne Khan to remarry?
Highlights

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్ లు కామన్. కొంతమంది పెళ్లి వరకు వెళ్లినా.. ఒకవేళ తమ పార్ట్నర్ తో ఏమైనా విబేధాలు వస్తే అంతే ఈజీగా విడాకులు కూడా తీసుకుంటారు

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్ లు కామన్. కొంతమంది పెళ్లి వరకు వెళ్లినా.. ఒకవేళ తమ పార్ట్నర్ తో ఏమైనా విబేధాలు వస్తే అంతే ఈజీగా విడాకులు కూడా తీసుకుంటారు. స్టార్ హీరో హ్రితిక్ రోషన్ తన చిన్ననాటి స్నేహితురాలు సుసానే ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దశబ్దానికి పైగానే ఈ జంట కలిసి జీవించింది. వీరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

కానీ కొన్ని కారణాల వలన ఈ జంట విడాకులు తీసుకుంది. అయినప్పటికీ తమ పిల్లల కోసం ఇద్దరూ తరచూ కలుస్తుంటారు. టూర్లకు కూడా కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. పిల్లల అవసరాల కోసమే ఈ జంట కలిసి సమయం గడుపుతున్నారని, తల్లితండ్రుల నుండి వారి పిల్లలు అంతులేని ప్రేమ పొందుతూ ఆనందంగా గడుపుతున్నారని వెల్లడించారు.

హ్రితిక్, సుసానే ఇద్దరూ కూడా స్వతంత్ర ఆలోచనలు గలవారు. ఒకవేళ వారిద్దరూ తిరిగి కలవాలనుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తారని అన్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం ఈ జంట తమ వివాహబంధాన్ని చట్టపరంగా రద్దు చేసుకుంది. అయినా ఇప్పటికీ స్నేహితుల్లా కలిసి గడుపుతున్నారు. భార్యభర్తలుగా విడిపోయినా.. తల్లితండ్రులుగా కలిసి ఉంటూ సంతోషంగా గడుపుతున్నారు. 

loader