కంగనా రనౌత్-హృతిక్ రోషన్ మధ్య ఎంత వివాదం నడిచిందో తెలిసిందే. కాగా అవన్నీ మరచి హృతిక్ రోషన్ ఆమెకు సపోర్ట్ చేయడం చర్చకు దారి తీసింది.  

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆమె జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. వాటిలో హృతిక్ రోషన్ తో ఎఫైర్ వివాదం ఒకటి. ఓ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్ ని ఆమె 'సిల్లీ ఎక్స్' అని సంబోధించింది. క్రిష్ 3 మూవీ సమయంలో హృతిక్ రోషన్ నాతో ఎఫైర్ నడిపాడని ఆమె ఆరోపణలు చేసింది. హృతిక్ రోషన్ ఆమె ఆరోపణలు ఖండించారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. ఇద్దరు పలు ఇంటర్వ్యూలలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం కొన్నాళ్ళకు సద్దుమణిగింది. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచింది కంగనా. కాగా చండీఘడ్ ఎయిర్ పోర్ట్ లో ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ నటి కంగనా రనౌత్ చెంప పై కొట్టింది. గతంలో మోడీ గవర్నమెంట్ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నార్త్ ఇండియాలో రైతులు ఉద్యమం చేశారు. వేల మంది రోడ్ల మీదకు వచ్చారు. 

ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టారు. ఈ కారణంగా కుల్విందర్ కౌర్ నటి కంగన రనౌత్ చెంప మీద కొట్టారు. రైతులు కేవలం రూ. 100 కోసం రోడ్ల మీద కూర్చున్నారని కంగనా రనౌత్ కించపరుస్తూ కామెంట్స్ చేసింది. అప్పుడు మా అమ్మ కూడా ఆ ఉద్యమంలో పాల్గొంది.. అని కుల్విందర్ కౌర్ ఈ పరిమాణం అనంతరం వివరణ ఇచ్చారు. కేవలం డబ్బులు తీసుకుని రైతులు ఉద్యమం చేస్తున్నారని కంగనా హేళన చేయడం వలన నేను ఆమెను కొట్టానని కుల్విందర్ కౌర్ పరోక్షంగా వెల్లడించింది. 

ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళా కానిస్టేబుల్ కి సపోర్ట్ చేస్తుంటే కొందరు కంగనా రనౌత్ కి సపోర్ట్ చేస్తున్నారు. అలియా భట్, అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా.. కంగనా పై దాడిని ఖండించారు. కాగా కంగనాను చెంపపై కొట్టడాన్ని ఖండిస్తూ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సదరు పోస్ట్ కి హృతిక్ రోషన్ లైక్ కొట్టాడు. పరోక్షంగా అతడు కంగనా సపోర్ట్ చేశాడు. తన బద్ద శతృవుకు హృతిక్ రోషన్ సపోర్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.