బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అతని సోదరి సునైనాను హింసిస్తున్నారని నటి కంగనా సోదరి రంగోలీ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో హృతిక్ కి, కంగనాకి మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు.

ఈ విషయంలో హృతిక్ సోదరి సునైనా.. కంగనాకి సపోర్ట్ చేసింది. సునైనాకి ఇంట్లో వారితో గొడవ జరిగిందని దాంతో ఆమె కంగనాకి సపోర్ట్ చేస్తుందనే వార్తలు వినిపించాయి. తాజాగా హృతిక్, అతడి ఫ్యామిలీ సునైనాని బాధ పెడుతున్నారని, దీంతో సహాయం కోసం సునైనా.. కంగనాకి ఫోన్లు చేస్తుందని రంగోలి కామెంట్స్ చేసింది.

ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో స్టోరీ మొత్తం రాసుకొచ్చింది. హృతిక్ ఫ్యామిలీ సునైనాని హింసలు పెడుతున్నారని దానికి కారణం ఆమె ఓ ముస్లిం వ్యక్తితో ప్రేమలో ఉండడమేనని చెప్పారు. ఆమె ప్రేమ ఇంట్లో వారికి నచ్చకపోవడంతో గత వారం ఓ మహిళా పోలీస్ ని ఇంటికి పిలిపించి సునైనాకి వార్నింగ్ ఇప్పించారని రంగోలి తన ట్వీట్ లో పేర్కొంది. సదరు పోలీస్ తో సునైనాను కొట్టించారని, ఆమె తండ్రి రాకేశ్ రోషన్ కూడా చేయి చేసుకున్నారని అన్నారు.

హృతిక్ కుటుంబం ఆమెకి హాని చేస్తారేమోనని భయం ఉందని, సునైనా.. కంగనాకి ఫోన్లు చేసి సాయం కోరుతున్నారని.. కానీ కంగనాకి ఎలా సహాయం చేయాలో తెలియడం లేదని అన్నారు. అందుకే విషయాన్ని సోషల్ మీడియాలో బయటపెడుతున్నానని.. ఇది చూసినా హృతిక్ ఫ్యామిలీ వెనక్కి తగ్గి సునైనా ప్రేమను అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చింది.