Asianet News TeluguAsianet News Telugu

5 వారాల్లో అద్భుతం చేసిన హృతిక్ రోషన్, ఇంతకీ ఏం సాధించాడంటే..?

బాలీవుడ్ లో ఫిట్ నెస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే కటౌట్ హృతిక్ రోషన్.. బాడీని బిల్డ్ చేయడంలో తనకు సాటి ఎవరూ లేదు. అంత అందమైన బాడీ కూడా అతనిదే అనాలి. ఈక్రమంలో హృతిక్ తాజాగా చేసిన ప్రయోగం  హైలెట్ అవుతోంది. 
 

Hrithik Roshan get Six Pack with in 5 week Days Time JMS
Author
First Published Oct 18, 2023, 2:11 PM IST

బాలీవుడ్ లో ఫిట్ నెస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే కటౌట్ హృతిక్ రోషన్.. బాడీని బిల్డ్ చేయడంలో తనకు సాటి ఎవరూ లేదు. అంత అందమైన బాడీ కూడా అతనిదే అనాలి. ఈక్రమంలో హృతిక్ తాజాగా చేసిన ప్రయోగం  హైలెట్ అవుతోంది. 

బాలీవుడ్ లో బాడీ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. కాని ఫిట్‌నెట్‌కు కరెక్ట్ మీనింగ్ లా ఉంటాడు హృతిక్ రోషన్... డాక్టర్లు రిస్క్ అని చెప్పినా కూడా ప్రాణలు లెక్క చేయకుండా కసరత్తులు చేసి.. అందమైన బాడీని సొంతం చేసుకున్నాడు హృతిక్. టోన్డ్ బాడీతో హృతిక్ రోషన్ అమ్మాయిల రాకుమారుడయ్యాడు. క్రిష్ లాంటి మూవీస్ చేసి.. ఇండియాన్ అడ్వెంచర్ హీరోగా కూడా మారాడు. 50 ఏళ్లు వచ్చినా.. ఏమాత్రం బాడీ లూజ్ అవ్వనీయకుండా కాపాడుకుంటున్నాడు. 

 

అయితే అప్పుడప్పుడు.. హృతిక్ రోషన్ కూడా కాస్త  కసరత్తులను పక్కనబెడుతుంటాడు. సినిమా ఉంది అంటే.. షూటింగ్ మొదలయ్యే నాటికి మునుపటి హృతిక్ లా మారిపోతాడు. అయితే, ఈ సారి కూడా తన టాలెంట్ చూపించాడు. బిమ్ వర్కౌట్స్ విషయంలో తనకు ఎంత కమాండ్ ఉందో నిరూపించాడు..  కేవలం ఐదే ఐదు  వారాల్లో ఆయన పోయిన సిక్స్‌ ప్యాక్‌‌‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఆగస్టు 31న కాస్తంత పొట్టతో బొద్దుగా కనిపించిన హృతిక్ అక్టోబర్ 7 కల్లా సిక్స్ ప్యాక్‌ తెచ్చుకున్నాడు. ఈ ప్రయాణాన్ని సంక్షిప్తంగా వివరిస్తూ నెట్టింట ఆయన పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఇంతకీ ఆయన పోస్ట్ ఏమని పెట్టాడంటే..? 

ఐదు వారాలు.. ప్రారంభం నుంచి ముగింపు వరకూ.. సెలవుల తరువాత.. షూటింగ్ తరువాత.. మిషన్ పూర్తి చేశా..  
ఈ మిషన్‌లో మోకాళ్లు, భుజాలు, వెన్ను మెదడు అన్నీ సహకరించాయి. ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుని కోలుకుని, కొత్త సమతౌల్యం సాధించాల్సిన సమయం వచ్చింది. ఈ జర్నీలో అత్యంత కష్టమైన పని.. ఫ్రెండ్స్‌, బంధువులు, పార్టీలకు నో చెప్పడం
రాత్రి 9 కల్లా నిద్రకు ఉపక్రమించడం కూడా ఓ మోస్తరు ఇబ్బందే. క్రిస్ గెథిన్ లాంటి మెంటార్ దొరకడం నిజంగా అద్భుతం. ఆయన అనుభవం, నైపుణ్యాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక స్వప్నిల్ హజారే లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నా టీంకి కూడా చాలా థ్యాంక్స్ అన్నారు.  వారు వెన్నంటి ఉండటంతోనే అనుకున్నది సాధించా అంటూ హృతిక్ ఇన్‌స్టాలో ఓ ట్వీట్ చేశాడు. 

ప్రస్తుతం హృతిక్ రోషన్ పోస్ట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నుంచి ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios