టాలీవుడ్ అగ్ర హీరోల్లో సిగ్గుకే సిగ్గు తెప్పించేంతలా సిగ్గుపడే హీరోల్లో ఫస్ట్ ర్యాంక్ బాహుబలి ప్రభాస్ దే. ప్రతీ సందర్భంలోనూ తన సిగ్గును నిరూపిస్తూనే వస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్. మరి ఇంతటి క్రేజీ  హీరోగా మారినా తనలోని బిడియం మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. ఇంతకీ ఆ బిడియం తన కెరీర్ కు ఏ మాత్రం అడ్డంకి కాకుండా ప్రభాస్ ను ఇనిస్పైర్ చేసిన అంశం ఏంటి. ప్రభాస్ ను దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లో క్రేజీ హీరోను చేసిన ఆ ఆదర్శం ఎక్కడి నుంచి వచ్చింది.

 

ప్రభాస్‌కు కాస్త సిగ్గు ఎక్కువ.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి అలాంటి ఆయన నేడు ఓ స్టార్‌ హీరోగా ఇంత స్థాయికి ఎలా చేరుకున్నారు. తన అద్భుతమైన నటనతో అంతర్జాతీయంగా ఎలా గుర్తింపు పొందారు. చుట్టూ వందల మంది ఉన్న షూటింగ్‌ స్పాట్‌లో బిడియం లేకుండా ఎలా నటించారు. దీనికంతటికీ కారణం ఓ సినిమా. అదే ప్రభాస్‌ పెదనాన్న నటించిన ‘భక్త కన్నప్ప’. దీన్ని చూసిన తర్వాత సినిమాలను కెరీర్‌గా ఎంచుకోవాలని, నటుడు కావాలని ప్రభాస్‌ ప్రేరణ పొందారట. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శివ భక్తుడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా 1976లో విడుదలైంది.

 

ప్రభాస్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ కథానాయిక పాత్ర పోషిస్తోంది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రం కోసం శ్రద్ధాకపూర్‌తో కలిసి నటించడం గురించి ప్రభాస్‌ ఇటీవల ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... ‘ఈ సినిమాకు శ్రద్ధాకపూర్‌ ఉత్తమ ఎంపిక. ఆమె ‘సాహో’ కోసం పనిచేయడం సంతోషంగా ఉంది. ఆమె పాత్ర కేవలం పాటలకు, కొన్ని సన్నివేశాలకు పరిమితం కాదు. కథకు ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెపై అద్భుతమైన సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయి’ అని ప్రభాస్ వివరించాడు.