జపాన్ లో రజనీ కాంత్ 67వజన్మదిన వేడుకలు జరుగుతున్నాయి చాలా ఘనంగా. తమిళ ప్రజలున్నమలేషియా, సింగపూర్ లలో రజనీ జన్మదిన వేడుకలు జరగడం ఒక ఎత్తు, తమిళనాడుకు ఏ మాత్రం సంబంధంలేని జపాన్ లో రజనీ జన్మదినం జరుపుకోవడం ఒక ఎత్తు. 2017 లోనే కాదు,  దశాబ్దాల కాలంగా  జపాన్ లో రజనీ జన్మదినం జరుపుకుంటున్నారు. అక్కడ ఇంతగా ఫాన్  ఫాలోయింగ్  ఉన్న భారతీ నటుడు లేడు.  జపాన్ కు భారతీయ చిత్రాలు ఎగుమతి కావడం  1954లో మొదలయిది. అపుడు చంద్రలేఖ (1948 నాటి చిత్రం) జపాన్ ప్రేక్షకుల ముందుకెళ్లింది. వాళ్ల మనుసును చూరగొన లేకపోయింది. ఈ మధ్య అడపదడపా భారతీయ చిత్రాలు జపాన్ వెళ్లినా, ఆ దేశం కుర్రకారు ఉలిక్కి పడింది 1998లో. అది రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ చిత్రంతో. తమిళసంస్కృతి  పట్ల జపనీయులు మక్కువ పెంచుకోవడం, జపాన్ యువకుల్లో రజనీ మోజు పెరిగిపోవడం అప్పటినుంచే మొదలయింది. ముత్తు సినిమాను ‘ముత్తు ఒడొరు మహారాజా’గా జపాన్ లోవిడుదలయింది. అది సూపర్ హిట్ అయింది. ఆ సినిమా అక్కడ 23 వారాలాడింది.  1.6 మిలియన్ యుఎస్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా అక్కడ అడుతున్నంత కాలం రజనీకాంత్, మీనా, పక్కన ఏనుగుఉన్న కటౌట్లు పోస్టర్లు టోక్యోలో ఎక్కడ చూసినా కనిపించేవట.

అంతర్జాతీయంగా ఇండియన్ సినిమా అంటే బాలివుడే. తెల్లటిచర్మం, మీసం కట్టు లేకి ముఖాలతో ఉన్న  హిందీ నటులకే గుర్తింపు  ఉండేంది.  అయితే, తొలిసారి మీసపు కట్టు, సౌత్ ఇండియన్ దేహచ్ఛాయ ఉన్న హీరో జపాన్ లో సుడిగాలి సృష్టించాడు. అతడే రజనీకాంత్. ఆదేశంలో రజనీ కాంత్ కల్ట్ ఫిగరయ్యారు. మాటవరసకి హిరోయోషి తకేడాను తీసుకుందాం.

తకేడా వయసు 39. ఆయనెపుడు రజనీకాంత్ బొమ్మలున్న టిషర్టునే వేసుకునేందుకు ఇష్టపడతాడు. జపాన్ సంప్రదాయాలకంటే, తమిళ సంప్రదాయాలను పాటించేందుకు ఇష్టపడతాడు. టోక్యో మెట్రోలో తిరగడం కంటే  గాడీ వుంటూ తెగ సౌండ్ చేస్తూ భారతీయ రోడ్ల మీద పరుగులు పెట్టే ఆటో లో తిరగడం ఆయనకు ఇష్టం. దీనికోసం అతగాడు ఒక ఆటోను ఏకంగా తమిళనాడు నుంచి దిగుమతి చేసుకున్నాడు. రజనీ కాంత్ లో గాలిలో చిటికెన వేలు తప్పడం, జుట్టున నిర్లక్ష్యంగా వెనక్కు ఎగదోయడం తకేడా అలవాటు చేసుకున్నాడు.

 

 

అభిమాన సంఘాల సంబంధించి రజనీకాంత్ సైన్యం భారీగానే ఉంది. టోక్యోలని రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ లో దాదాపు 300 వేలమంది సభ్యలున్నారు. ఇలాంటి ఫ్యాన్ క్లబ్బులు ఒసాకా, కోబ్ ల లో కూడా ఉన్నాయి. రజనీమోజు, తమిళ సినిమా ల పిచ్చి ఎంతదాకా వెళ్లిందంటే చాలా తకేడా వంటి కుర్రాళ్లు తమిళం కూడా నేర్చుకున్నారు. రజనీ కటౌట్లకు పాలాభిషేకం కూడా చేస్తున్నారు.