ట్విట్టర్ పాలోవర్స్ కు సమంత క్రేజీ సమాధానాలు నాగార్జున కోడలిగా ఎలా పీలవుతున్నారంటే పెళ్లయ్యాక అడగండన్న సమంత

తన ట్విటర్ ఫాలోయర్లతో సరదాగా సంభాషించింది సమంత. ఈ సందర్భంగా “నాగార్జునకు కోడలు కాబోతున్నారు కదా.. ఎలా ఫీలవుతున్నారు?’’ అన్న ప్రశ్నకు సమాధానంగా, ఈ ప్రశ్నను పెళ్లయ్యాకా అడగాలని చెప్పింది ఈ చెన్నై భామ. 2016 చాలా మంచి అనుభూతులను ఇచ్చిందని తెరి, అఆ వంటి సినిమాలు ఆనందాన్నిచ్చాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. వచ్చే ఏడాది తనవి ఐదారు సినిమాలు విడుదల అవుతాయని, ఒక సినిమాను స్నేహితులతో చేస్తానని వివరించింది. ఈ ఏడాది సినిమాల్లో ‘దంగల్’ బాగా నచ్చిందని చెప్పింది.