మహేష్ బాబు ఫ్యామిలీ 2024 లో ఎన్ని దేశాలు తిరిగారో తెలుసా..? స్వయంగా వెల్లడించిన నమ్రత.
ఖాళీ టైమ్ దొరికితే చాలు ఫారెన్ ట్రీప్పులు వేస్తుంటారు మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ. ప్రతీ ఏడాది ఎన్నో దేశాలు తిరిగే సూపర్ స్టార్ ఫ్యామిలీ.. గత ఏడాది ఎన్ని దేశాలు వెళ్ళారో తెలుసా..?
మహేష్ బాబు ఫారెన్ టూర్లు..
సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ఇండియాలో ఉండేదానికంటే.. ఫారెన్ లో ఉండేది ఎక్కువైపోయింది. షూటింగ్స్ ఉంటనే ఇండియాలో ఉంటున్నారు. షూటింగ్స్ లేవు అంటే వెంటనే ఏదో ఒక ప్లైట్ ఎక్కేసి.. ఫారెన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక షూటింగ్ మధ్యలో కూడా కొన్నిరోజులు చిల్ అవ్వడానికి బ్రేక్ ఇచ్చి మరీ.. చెక్కేస్తుంటాడు మహేష్. ఈ మధ్య మరీ ఎక్కువగా ఫారెన్ కు వెళ్తున్నాడు సూపర్ స్టార్.
అంతే కాదు సూపర్ స్టార్ గారాల కొడుకు గౌతమ్ ఫారెన్ లోనే చదువుతుండటంతో.. ఇంకాస్త ఎక్కువగా టూర్లు వేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యామిలీ. ఈ విషయంలో ఓ సందర్భంలో ఎన్టీఆర్ కూడా గట్టిగా కౌంటర్ వేశాడు. నువ్వు ఫారెన్ లో ఉంటూ.. అప్పుడప్పుడు షూటింగ్ కోసం ఇండియాకు వచ్చి వెళ్తున్నావా అన్నా అంటూ.. మహేష్ బాబును సరదాగా ర్యాగింగ్ చేశాడు. ఇలా ఫారెన్ టూర్లలో రికార్డ్ క్రియేట్ చేశాడు మహేష్ బాబు అది కూడా ఫ్యామిలీతో ఈక్రమంలోనే తమ టూర్లకు సబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంది నమ్రత.
నమ్రత సోషల్ మీడియా పోస్ట్
మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. మహేష్ బాబుతో పాటు తన పిల్లలకు సబంధించిన ప్రతీ అప్ డేట్ ను ఆమె ఇన్ స్టాలో పంచుకుంటుంది. మహేష్ బాబు మాత్రం అప్పడప్పుడు నెట్టింట్లో స్పందిస్తుంటారు. ఇక నమ్రత ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీ ఫోటోలు, టూర్స్, పిల్లల ఫోటోలు అన్ని షేర్ చేసుకుంటుంది. మహేష్ బాబు, అతని ఫ్యామిలీ రెగ్యులర్ గా విదేశాలకు ట్రిప్స్ కి వెళ్తుంటారని తెలిసిందే. మహేష్ కి ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీతో ఏదో ఒక దేశానికి చెక్కేస్తాడు.
ఆ టూర్ కు సబంధించిన ఫోటోలు వదలకుండా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ప్రతీ ఏడాది పదుల సంఖ్యలో టూర్లకు వెళ్తుంటారు ఈ ఫ్యామిలీ. అయితే లాస్ట్ ఇయర్ అంటే 2024 లో వీరు ఎన్ని విదేశీ యాత్రలు చేశారో తెలుసా. ఈ విషయాలు వెల్లడిస్తూ.. రీసెంట్ గా నమ్రత శరోద్కర్ ఓ పోస్ట్ ను శేర్ చేసుకున్నారు. 2024 అయిపోయి 2025 రావడంతో నమ్రత గత సంవత్సరం తాను వెకేషన్ కి వెళ్లిన సిటీల పేర్లు చెప్తూ ఆ లొకేషన్స్ లో దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
10 దేశాలు చుట్టేసిన సూపర్ స్టార్ ఫ్యామిలీ
అయితే ఆమె మొత్తంగా గత ఏడాదంతా 10 దేశాలు తిరిగినట్టు తెలుస్తోంది. ఇక ఒక్క సారిగా తమ అభిమాన నటుడి టూర్లకు సబంధించిన ఫోటోలు చూసి ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాలకు తిరగేశారా అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ లో నమ్రత తాను, తన పిల్లలు దిగిన ఫోటోలు మాత్రమే షేర్ చేసింది. ఇందులో మహేష్ బాబు కనిపించకపోవడం ఆశ్చర్యం.
ఇక ఈపోస్ట్ లో నమ్రత ఎక్కడెక్కికి వెళ్ళినట్టు ఉందంటే.. ఇంగ్లాండ్ లోని లండన్, ఇటలీలోని పోర్టోఫినో, మొనాకో, మాల్దీవ్స్, అమెరికాలోని న్యూయార్క్, దుబాయ్, థాయిలాండ్ లోని బ్యాంకాక్, స్విట్జర్లాండ్ లోని జెనీవా, st మోరిట్జ్, జర్మనీలోని బాడెన్ బాడెన్, ఇండియాలోని జైపూర్, ముంబై నగరాలకు మహేష్ ఫ్యామిలీ గత సంవత్సరం వెకేషన్స్ కి వెళ్లారు. ఆల్మోస్ట్ 9 దేశాలతో పాటు ఇండియా కూడా కలుపుకొని 10 దేశాల్లో తిరిగేశారు.
రాజమౌళి - మహేష్ బాబు సినిమా
ఇక ప్రస్తుతం రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వడంతో 2025 లో వీరు ఫారెన్ టూర్లు వెళ్లడం కష్టమనే చెప్పాలి. షూటింగ్ పర్పస్ ఏదేశం అయిన వెళ్తే.. అప్పుడు తనతో పాటు ఫ్యామిలీని కూడా తీసుకెళ్లడం మహేష్ బాబుకు అలవాటు. మరి ఈసారి అది కుదురుతుందా లేదా తెలియదు. దాదాపు రెండేళ్ల పాటు రాజమౌళికి టైమ్ ఇవ్వాల్సిందే. పాన్ వరల్డ్ సినిమా కావడంతో మరింత కష్టపడాలి. మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
రీసెంట్ గానే రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఓపెనింగ్ సింపుల్ గా జరిగింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈసినిమా కోసం సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఓపెనింగ్ కు వచ్చాడు మహేష్ బాబు. అంతే కాదు ఈమూవీలో సిక్ ప్యాక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ టైమ్ సినిమా కోసం షర్ట్ విప్పబోతున్నాడట మహేష్. మరి ఈ వార్తలో నిజమెంతో చూడాలి.