టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొరటాల శివ ఉన్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ హిట్ కొట్టాయి. అయితే ఆచార్య విషయంలో ఆయన ప్లానింగ్ అంత కరెక్ట్ గా లేదనిపిస్తుంది.
సినిమాకు స్క్రిప్టే ప్రధానం. ఓ మంచి కథ కథనం ఓ హీరోని ఓవర్ నైట్ స్టార్ చేయగలవు. అదే సమయంలో బ్యాడ్ స్క్రిప్ట్ స్టార్ హీరోకి కూడా డిజాస్టర్ ఇస్తుంది. కాగా దర్శకుడు కొరటాల శివపై పరిశ్రమలో మంచి హైప్ ఉంది. రచయితగా బ్లాక్ బస్టర్స్ కొట్టిన కొరటాల దర్శకుడిగా సూపర్ సక్సెస్. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు అన్నీ సూపర్ హిట్స్. అందుకే ఆయనకు చిరంజీవి(Chiranjeevi) పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. తనతో మూవీ చేయమన్నాడు.
అయితే ఈ మూవీకి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కరోనా రాకతో సినిమా ఆలస్యం అయ్యింది. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. ఫైనల్ గా ఏప్రిల్ 29న మూవీ విడుదలకు సిద్ధమైంది. కాగా ఈ మూవీ గురించిన కొన్ని సంగతులు దర్శకుడు కొరటాల (Koratala Siva)లోపాలు తలెత్తుతున్నాయి. ఆచార్య నుండి హీరోయిన్ కాజల్ అవుట్ అని తేలింది. ఆచార్య చిత్రం కోసం మొదట త్రిషను తీసుకున్నారు. చిరంజీవికి జంటగా ఆమెను ఎంపిక చేశారు. సినిమాలో తన పాత్రకి ప్రాధాన్యత లేదని త్రిష తప్పుకున్నారు.
త్రిష ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాక కాజల్ ని తీసుకున్నారు. డబ్బే పరమావధిగా భావించే కాజల్ ఓ కోటి తీసుకొని ఆచార్య (Acharya)మూవీ ఒప్పుకున్నారు. ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. అంతా ఐపోయింది. తీరా సినిమా విడుదలయ్యే నాటికి కాజల్ అసలు సినిమాలోనే లేదంటున్నారు. ఆచార్య ఫస్ట్ హీరోయిన్ గా ప్రచారమైన కాజల్ అసలు సినిమాలోనే లేదనడం పెద్ద డౌట్. సినిమా కొరటాల రీ షూట్ చేశారన్నారు. హీరోయిన్ ని తప్పించారు. ఇన్ని అతుకుల మధ్య ఈ బొమ్మ ఎలా ఉండనుందో చూడాలి.
