బ్రహ్మానందం, అలీ ఇద్దరూ తెలుగులో కామెజీ సామ్రాజ్యాన్ని తిరుగులేకుండా ఏలినవారు. వారి వాయిస్ విన్నా జనాలకు గిలిగిలింతలు పెట్టినట్లు నవ్వు వస్తుంది. కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. వెనకబడ్డారనుకున్న వీళ్లిద్దరు తమ వాయిస్ తో మరోసారి తెలుగునాట నవ్వులు పూయించేసి ఫామ్ లోకి వచ్చేసారు.  ఇప్పుడు అదే విషయం మరోసారి  ప్రూవ్ అయ్యింది. వారిద్దరు కలిసి హాలీవుడ్ చిత్రం ది లయిన్ కింగ్ తెలుగు వెర్షన్ లో డబ్బింగ్ చెప్పారు.

ప్రఖ్యాత డిస్నీ సంస్థ నుంచి టూడీ యానిమేటెడ్‌ సినిమాగా 1994లో విడుదలైంది ‘లయన్‌ కింగ్‌’. ఆ చిత్రం తాజాగా త్రీడీ యానిమేటెడ్‌ సాంకేతికతతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సొబగులద్దుకొని సరికొత్తగా ముస్తాబైంది. జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఫాసా అనే సింహం, సింహం పిల్ల సింబ, ముంగిస టిమోన్‌, అడవి పంది పుంబా చుట్టూ సాగే కథ ఇది. తెలుగులో ఈ సినిమాకి ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, అలీ గాత్రదానం చేశారు. 

పుంబా పాత్రకి బ్రహ్మానందం, టిమోన్‌ పాత్రకి అలీ గొంతిచ్చారు.  ఫస్టాఫ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ రెండు పాత్రలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారాయి. జనం ఈ బ్రహ్మీ, అలీ గొంతలు వినగానే థియోటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు. ఒరిజన్ లో లేని ఫన్ ని ఈ పాత్రకు రాయించి డబ్బింగ్ చెప్పించటం కలిసి వచ్చింది.   ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’, ‘అల్లాద్దీన్‌’ తరహాలో ‘లయన్‌ కింగ్‌’ అలరిస్తోంది. 

ట్రేడ్ వర్గాల  సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 65 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అవేంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్, అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ త‌ర్వాత ఇండియాలో అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ సినిమా ఇదే కావ‌డం గొప్ప విషయం. తెలుగులో కూడా ల‌య‌న్ కింగ్ వ‌సూళ్లు భారీగానే ఉండటంతో  డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.