ఎన్టీఆర్ కథానాయకుడు కొట్టిన దెబ్బ తో డిస్ట్రిబ్యూటర్స్  భయపడిపోయారు. సినిమాపై హైప్ క్రియేట్ అవటంతో మంచి రేట్లుకు సినిమాని తీసుకుని రికవరీ అనేది అసలు లేకపోవటంతో ఏం చేయాలో అర్దం కాని పరిస్దితిలో పడ్డారు. అప్పటికి మహానాయకుడు చిత్రం ఉచితంగా ఇస్తారంటూ వార్తలు వచ్చినా ఆనందపడలేదు. ఏమో కథానాయకుడు ఇలా ఉంది..ఇంక మహానాయకుడు ఎలా ఉంటుందో ..కలిసొచ్చేదేమి ఉంది అని పెదవి విరిచేసారు.

ఇదిలా ఉండగానే హఠాత్తుగా బాలయ్య బంధువు సీన్ లోకి వచ్చి ఇరవై శాతం నష్ట పరిహారం ఇస్తామని, సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేద్దామన్నట్లుగా వార్తలు వచ్చాయి. అదీ ఇంకా మండుకొచ్చింది డిస్ట్రిబ్యూటర్స్ కు. అయితే ఇలా చేయటం బాగా ప్లస్ అయ్యింది.

సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సొంత రిలీజ్ నిర్ణయం తీసుకున్నారంటే సెకండ్ పార్ట్ లో విషయం ఉండే ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి..అందుకే వాళ్లు ఆ నిర్ణయానికి వచ్చి , మనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారనే భావన డిస్ట్రిబ్యూటర్స్ లో కలిగి..మహానాయుకుడు తీసుకుంటామంటూ పట్టుపట్టారు. ఇది ఓ రకంగా మహానాయకుడు టీమ్ వేసిన ప్లాన్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అంతేతప్ప సురేష్ ప్రొడక్షన్స్ కు ఇవ్వాలనుకోవటం అబద్దం అంటున్నారు. 

అప్పుడు బాలయ్య సీన్ లోకి వచ్చి...డోంట్ వర్రీ...మహానాయకుడు మీకే ఇస్తాం. మీరు పైసా కట్టక్కర్లేదు. ప్రింట్ ఖర్చులు, పబ్లసిటి వంటివి మేమే చూసుకుంటాం. మా మూలంగా నష్టపోయిన మిమ్మల్ని ఎలా వదిలేస్తాం అంటూ డిస్ట్రిబ్యూటర్స్ ని మంచి చేసుకున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక మీరు మొదట వచ్చిన డబ్బులో ముప్పై మూడు శాతం ఫస్ట్ ఇనిస్ట్రాల్మెంట్ గా తీసుకోండి. ఓవర్ ఫ్లో వచ్చాక అందులోంచి అరవై శాతం మాకు, నలభై శాతం అన్నట్లు పంచుకుందాం అని ప్రపోజల్ పెట్టారు. 

అప్పటికి ఈ సినిమా కూడా ప్లాఫ్ అయితే మా పరిస్దితి ఏమిటి అని కొందరు అనుమానంగా అడిగారు. దానికి బాలయ్య....అప్పుడు మేము మా బ్యానర్ లో చేయబోయే తదుపరి సినిమాని రీజనబుల్ రేట్లకు మీకే ఇస్తాం. మిమ్మల్ని రూపాయి కూడా నష్టపోనివ్వం అనటంతో డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా మహానాయకుడు తీసుకోవటానికి ముందుకు వచ్చారు. ట్రైలర్ వదిలారు టీమ్. 

‘మహా నాయకుడు’ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రమిది. విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, కల్యాణ్‌ రామ్‌ కీలక పాత్రధారులు. క్రిష్‌  దర్శకత్వం వహించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి.