అక్షయ్ కుమార్‌కి పెద్ద షాక్ తగిలింది. ఆయన హీరోగా నటించిన `హౌస్‌ఫుల్5` ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. ఏకంగా హెచ్ డీ ప్రింట్ ని కొన్నిపైరసీ సైట్లు లీక్ చేయడం గమనార్హం.
పైరసీ దెబ్బ సినిమాలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. పెద్ద సినిమాల విషయంలోనే ఇది ఎక్కువగా జరుగుతుంది. భారీ బడ్జెట్ చిత్రాలనే టార్గెట్ చేస్తూ కొన్ని పైరసీ సైట్లు సినిమా విడుదలైన కాసేపట్లోనే ఆన్‌లైన్‌లో లీక్ చేస్తున్నాయి. ఏకంగా హెచ్ డీ ప్రింట్‌లనే తమ పైరసీ సైట్లలో ఉంచడం గమనార్హం. తాజాగా అక్షయ్ కుమార్ `హౌస్‌ఫుల్ 5` సినిమా పైరసీకి గురయ్యింది.
అక్షయ్ కుమార్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ నటించిన `హౌస్‌ఫుల్ 5` శుక్రవారం (జూన్ 6న) థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి షో తర్వాత, ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. పలు పైరసీ సైట్లు తమ మాధ్యమాల్లో ఈ సినిమాని హెచ్‌డీ ప్రింట్‌తో పోస్ట్ చేశారు.
హౌస్‌ఫుల్ 5 పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో లీక్
`హౌస్‌ఫుల్ 5` పైరేటెడ్ వెర్షన్ థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే అనేక ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. Filmyzilla, Movierulez, Telegram, Tamilrockerz వంటి అనేక సైట్లలో 1080p, 720p, 480p, 360p, 240p, HD వెర్షన్లలో ఈ కామెడీ డ్రామాని లీక్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. ఇది చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. అదే సమయంలో నిర్మాతలకు పెద్ద దెబ్బగా మారుతుంది.
పైరసీ చట్టవిరుద్ధం, భారీ జరిమానా
సినిమా పైరేటెడ్ వెర్షన్ చూడటం చట్టవిరుద్ధం. దీనివల్ల అనేక చెడు పరిణామాలు ఉంటాయి. దోషిగా తేలితే 2 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు. మీ సిస్టమ్‌లోకి అవాంఛిత వైరస్‌లు రావచ్చు. పైరేటెడ్ సినిమాలు చూడటం వల్ల మీ డేటాకు నష్టం జరుగుతుంది, అంతేకాకుండా సినిమా నిర్మాతలు, నటులకు కూడా నష్టం జరుగుతుంది.
సినిమా తీయడానికి చాలా కష్టపడతారు. కోట్లు ఖర్చు పెడుతారు. వారంతా కష్టపడేది ఆడియెన్స్ కి వినోదాన్ని అందించడం కోసమే. సినిమాని థియేటర్లలో చూస్తేనే ఆ వినోదాన్ని ఆడియెన్స్ ఫీలవుతారు. ఇలా పైరసీ చూడటం వల్ల ఆ అనుభూతిని పొందడం కష్టం. కాబట్టి ఎవరూ ఇలాంటి పైరసీ సైట్లని ఎంకరేజ్ చేయోద్దు.
హౌస్‌ఫుల్ 5 తారాగణం
`హౌస్‌ఫుల్`ఫ్రాంచైజీ హిందీలో అత్యంత విజయవంతమైన సిరీస్‌గా నిలిచింది. దీనిలో భాగంగా ఇప్పుడు 5వ సీక్వెల్ వస్తుంది. ఈ ఐదవ భాగానికి దర్శకత్వం తరుణ్ మన్సుఖాని వహించారు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్‌లతో పాటు, ఫర్దీన్ ఖాన్, డినో మోరియా, చంకీ పాండే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జానీ లివర్, నర్గిస్ ఫాక్రీ, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, చిత్రాంగద సింగ్, రంజిత్, నిఖితిన్ ధీర్, సోనమ్ బజ్వా, సౌందర్య శర్మ కూడా నటించారు. ఇక శుక్రవారం విడుదలైన `హౌస్ ఫుల్ 5`కి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది.
గమనిక -
ఏషియానెట్ న్యూస్ ఎలాంటి పైరసీని సమర్ధించదు. చట్టవిరుద్ధమైన లేదా అనుచితమైన పనులకు దూరంగా ఉండాలని పాఠకులకు సూచిస్తున్నాము.
