తెలుగు పరిశ్రమ లో ప్రారంభం నుంచి  కమెడియన్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి హీరోగా మారిన వాళ్లు ఉన్నారు. అయితే నిలదొక్కుకున్న వాళ్లు మాత్రం లేరు. అదే పద్దతిలో స్టార్ కమిడియన్ గా ఎదిగిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారాడు. హీరోగా సునీల్ కు మర్యాద రామన్న, పూలరంగడు లాంటి విజయాలు దక్కాయి. కానీ ఆ తర్వాత హిట్ అనేది అతనికి మొహం చాటేసింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేకపోవడంతో సునీల్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. 

కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా సునీల్ అదరగొట్టేశాడు. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరించిన కమిడియన్ గా రీఎంట్రీలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.  . `అర‌వింద స‌మేత‌` చిత్రంతో క‌మెడియ‌న్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశార‌ని చెప్పాలి. ఇప్పుడు క‌మెడియ‌న్‌గా బిజీ అవుతున్నారు.ఇక  సునీల్ దారిలోనే స‌ప్త‌గిరి హాస్యనటుడుగా మొదలెట్టి   హీరోగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. 

ఈ నేఫధ్యంలో మ‌రి మీరు హీరోగా కంటిన్యూ అవుతారా.. క‌మెడియ‌న్‌గా సినిమాలు చేస్తారా? సునీల్ బాట‌లోనే ప్ర‌యాణిస్తారా? అని  మీడియా వారు రీసెంట్ గా అడిగారు. దానికి  స‌ప్త‌గిరి చాలా తెలివిగా స‌మాధానం చెప్పారు.

సప్తగిరి మాట్లాడుతూ..`అంద‌రి జీవితాలు ఒకేలా ఉండ‌వు. చేతికున్న ఐదువేళ్లు ఒకేలా ఉండ‌వు క‌దా!. సునీల్ అన్న అర‌డుగులు ఉంటారు. నేను ఐదు అడుగులే ఉంటాను. ఆయ‌న సిక్స్ ప్యాక్ చేశారు. నేను యోగా నేర్చుకున్నాను. ఆయ‌న‌ది భీమ‌వ‌రం, నాది చిత్తూరు. ఎవ‌రి ప్రాప్తం వారిది` అన్నారు స‌ప్త‌గిరి.