విజయ్ దేవరకొండ సినిమాల్లో ముద్దులు సీన్లు చాలా కామన్. 'అర్జున్ రెడ్డి' సినిమాలో ఎన్ని హాట్ లిప్ లాక్ లు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'గీత గోవిందం' సినిమాలో కూడా రష్మికతో విజయ్ కి ఓ లిప్ లాక్ సీన్ ఉంది కానీ అది క్లైమాక్స్ లో వచ్చే సీన్.

'టాక్సీవాలా'లో కూడా కిస్ సీన్స్ లో నటించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు తను నటిస్తోన్న 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా ఇటువంటి సన్నివేశాలకు కొదవ లేదని అంటున్నారు.

ఈ సినిమా లిప్ లాక్ ల విషయంలో 'అర్జున్ రెడ్డి'ని గుర్తు చేస్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లీడర్ గా కనిపించనున్నాడు. స్టూడెంట్స్ మధ్య గొడవలు, ప్రేమ వ్యవహారాలు వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది.

కాలేజ్ లవ్ స్టోరీ అంటే ముద్దు సీన్లు కామన్ కదా.. అందుకే ఇప్పుడు 'డియర్ కామ్రేడ్'లో కూడా లిప్ లాక్ సీన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల్లో విజయ్, రష్మిక జీవించేశారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.