తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమైపోయింది. తొలి వారంలోనే షోపై ఉత్కంఠ కలిగించేలా ప్లాన్ చేస్తున్నారు. తొలి నామినేషన్ కూడా జరిగిపోయింది. మంగళవారం జరిగిన మూడవ ఎపిసోడ్ లో తొలి వారం ఎలిమినేషన్ కొరకు సింగర్ రాహుల్, నటి పునర్నవి, హేమ, హిమజ, జాఫర్, వితిక నామినేట్ అయ్యారు. దీనితో తొలివారం షో నుంచి ఎలిమినేటి అయ్యే సెలబ్రిటీ విషయంలో ఉత్కంఠ నెలకొంది ఉంది. 

ఇదిలా ఉండగా బిగ్ బాస్ 3 గురించి మరో ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ షోలోకి హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ 3కి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

తొలి వారం ఎలిమినేట్ అయ్యే సెలబ్రిటీ స్థానంలోకి శ్రద్దా దాస్ ని తీసుకొస్తారట. హీరో వరుణ్ సందేశ్ తన స్థానంలో పునర్నవిని నామినేట్ చేశాడు. దానిని పునర్నవి కూడా స్పోర్టివ్ గానే తీసుకుంది. ప్రస్తుతం నామినేషన్ లో జాఫర్, వితిక, హిమజ లాంటి సెలెబ్రిటీలు ఉన్నారు. వీరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు తక్కువ అంటూ ప్రచారం జరుగుతోంది. పునర్నవి పైనే ఎక్కువగా ఎలిమినేషన్ కత్తి వేలాడుతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.