బిగ్ బాస్ గా అదరగొడుతున్న యంగ్ టైగర్ షోను తనదైన శైలిలో హోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ముమైత్ ను ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూంకు పంపిన బిగ్ బాస్

స్టార్ మా ఛానల్ లో వస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షోలో వారాంతంలో ఎన్.టి.ఆర్ వచ్చి హుషారెత్తించడం షోకు హైలైట్ గా నిలుస్తోంది. ప్రతివారం ఎన్.టి.ఆర్ ఈసారి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడు అన్న దాని మీద ఆడియెన్స్ ఎక్సయిట్మెంట్ ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఎన్.టి.ఆర్ ఎంట్రీ అదుర్స్ అని చెప్పాలి.

ఈ సారి షోను కాస్త వెరైటీగా.. ఓ పాటతో ప్రారంభించారు ఎన్టీఆర్. సిరివెన్నెల రాసిన.. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి.. విశ్రమించవద్దు ఏ క్షణం.. విస్మరించవద్దు నిర్ణయం. అంటూ పాటను పాడుతూ.. ఆ పాట జీవితానికి ఓ బాట అంటూ ఎన్.టి.ఆర్ తన యాంకరింగ్ స్టార్ట్ చేశాడు.

ఇక కొత్త కెప్టెన్ నవదీప్ ను నోట్ల విషయంలో ఆటాడుకున్న విధానంతో పాటుగా.. ధనరాజ్ ను వీపుపై ఎక్కించుకుని అర్చన రెండు రౌండ్ లు సోఫా చుట్టేయడం... ఎక్కడం ఎలా వుందంటూ ఎన్టీఆర్ మన ధనరాజ్ ను అడగడం అంతా కడుపుబ్బా నవ్వించింది. 

ముమైత్ ను ఎలిమినేట్ చేసినట్టే చేసి ఈ ఎలిమినేషన్ ఎందుకో ఫెయిర్ కాదని అనిపిస్తోందంటూ... ఆమెను సీక్రెట్ రూం లోకి పంపించడం జరిగింది. హౌజ్ మెట్స్ కు ముమైత్ ఎలిమినేట్ అయ్యిందనే తెలుసు కాని ముమైత్ మాత్రం బిగ్ బాస్ సీజన్ 1 లో సీక్రెట్ రూం లో బందీగా ఉండబోతుంది. బిగ్ బాస్ సీజన్ 1 లోనే ఈ సీక్రెట్ రూం హంగామా మొదలు పెట్టాడు ఎన్.టి.ఆర్.

మొత్తానికి అనుకున్నట్టుగానే ఎన్.టి.ఆర్ అదరగొట్టేశాడు. ఇక బోన్ లో హౌజ్ మెట్స్ గురించి అభియోగాలు చేస్తూ వారి నుండి వివరణ అడిగిన తీరు ఆకట్టుకుంది. మొత్తానికి ఈ శని ఆదివారాలు కూడా తారక్ స్టీల్ ద షో.. కుర్చీలాటతో పాటుగా ఎన్.టి.ఆర్ వారితో సాగించిన సరదా సంభాషణలు ఆడియెన్స్ ను అలరించాయి. ఈ వారం రేటింగ్స్ లో డబుల్ ధమాకా అంటే... ఎన్టీఆర్ షో రేటింగ్స్ అమాంతం ఆకాశాన్నంటాయని తెలుస్తోంది.