Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ షోపై నాగ్ ఆసక్తికర కామెంట్స్ !

 

కింగ్ నాగార్జున హోస్ట్ గా మరోమారు బిగ్ బోస్ షోలో కనిపించనున్నారు. సీజన్3,4 హోస్ట్స్ చేసిన నాగార్జున వరుసగా, సీజన్ 5 బాధ్యతలు కూడా తీసుకున్నారు. నాగార్జున లేటెస్ట్ సీజన్ నుండి తప్పుకున్నారని అనేక కథనాలు రాగా, అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. స్టార్ మా మాత్రం నాగార్జున పైనే నమ్మకం ఉంచి రంగంలో దించింది.

host nagarjun made interesting comments on bigg boss show
Author
Hyderabad, First Published Sep 4, 2021, 7:57 AM IST


ఇంకా గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ కర్టైన్ రైస్ ఎపిసోడ్ గ్రాండ్ గా ప్రసారం కానుంది. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్స్ పై ప్రేక్షకులలో ఓ అవగాహనా వచ్చింది. ప్రచారం జరిగిన 20మంది సెలెబ్రిటీల నుండే కంటెస్టెంట్స్ ఉండే అవకాశం కలదు. గత సీజన్ తో పోల్చితే ఈసారి హౌస్ లోకి బాగా పరిచయమున్న సెలెబ్రిటీలు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. 


ఈసారి బిగ్ బాస్ షో అత్యంత పోటీ ఎదుర్కోనుంది. బిగ్ బాస్ పాప్యులర్ షో అయినప్పటికీ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు గట్టి పోటీ ఇవ్వనుంది. అదే సమయంలో ఐపీఎల్ లేటెస్ట్ షెడ్యూల్ కూడా రానున్న వందల రోజులలో ఉంది. దీనితో బిగ్ బాస్ నిర్వాహకులు మరింత ఎంటర్టైనింగ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అందమైన భామలతో హౌస్ లో గ్లామర్ డోస్ పెంచనున్నారని కూడా వినికిడి. 


కింగ్ నాగార్జున హోస్ట్ గా మరోమారు బిగ్ బోస్ షోలో కనిపించనున్నారు. సీజన్3,4 హోస్ట్స్ చేసిన నాగార్జున వరుసగా, సీజన్ 5 బాధ్యతలు కూడా తీసుకున్నారు. నాగార్జున లేటెస్ట్ సీజన్ నుండి తప్పుకున్నారని అనేక కథనాలు రాగా, అవన్నీ స్టార్ మా మాత్రం నాగార్జున పైనే నమ్మకం ఉంచి రంగంలో దించింది. ఇక రేపు ప్రారంభం కానున్న బిగ్ బాస్ షో గురించి నాగార్జున ఈ విధంగా స్పందించారు. 

'గత కొన్ని నెలలు ప్రతిఒక్కరికీ సవాల్ విసిరాయి. ఈ షోతో ప్రేక్షకులలో ఆనందం, సంతోషం తిరిగి తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఓ నటుడిగా కంటెస్టెంట్స్ వాస్తవ భావాలు వెలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దీని వలన కంటెస్టెంట్స్ ని ప్రేక్షకులు మరింతగా అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి వినోదం అందించే ఈ షోలో భాగం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది'... అంటూ షో పట్ల తన అభిప్రాయం తెలియజేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios