Asianet News TeluguAsianet News Telugu

#Masooda: ‘మసూద’ఓటిటి రిలీజ్ డేట్.. ఈ నెల్లోనే

 మసూద సినిమా కోసం నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు వచ్చి ప్రమోషన్స్ చేశారు.  ఈ చిత్రం భాక్సాఫీస్ దగ్గర బాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

Horror Blockbuster Masooda OTT streaming date and release partner
Author
First Published Dec 10, 2022, 6:41 AM IST

పలాస 1978, జార్జిరెడ్డి ఫేం తిరువీర్ (Thiruveer) హీరోహా తేలిన చిత్రం ‘మసూద’ (Masooda). స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించగా.. డెబ్యూ డైరెక్టర్‌ సాయికిరణ్‌ దర్శకత్వం వహించాడు. కావ్య కల్యాణ్ రామ్‌, సంగీత కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 18న విడుదలై  భాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ తెచ్చుకుంది.
 
సంగీత, అల్లు అర్జున్ గంగోత్రి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య ప్రధాన పాత్రల్లో హర్రర్ ... థ్రిల్లర్ ఫిల్మ్ గా తెరకెక్కిన మసూద మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు.  ప్రస్తుతం ఇంకా థియేట్రికల్ రన్ లో ఉన్న ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు  ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మూవీని ఆహా భారీ ధరకు కొనుగోలు చేసిందని డిసెంబర్ 16 లేదా 23వ తేదీ నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కి ఉంచబోతున్నట్లు సమాచారం.
 
 డిసెంబర్ 16 న అవతార్ మూవీ వరల్డ్ వైడ్ గా క్రేజీగా విడుదల కాబోతుంది అదే రోజు ఓటిటి నుండి మసూదని విడుదల చేస్తే కలిసొస్తుంది అని మేకర్స్ చూస్తున్నారట. త్వరలోనే మసూద ఓటిటి రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  థియేటర్స్ లో సినిమా చూడని  చాలా మంది.. మసూద మూవీని ఓటిటిలో చూసేందుకు ఎంతో ఎక్సయిట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు.  ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ని ఓటిటిలో మంచి ఎక్సపీరియన్స్ ఇస్తుందంటున్నారు. హారర్ ఫిల్మ్ లు ఓటిటిలో బాగా వర్కవుట్ అవుతున్నాయి.  ఈ సినిమా కేవలం హారర్ గానే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్..   స్టోరీ, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ వీక్షకుల మైండ్ బ్లాక్ చేస్తూ సాగుతుంది.

చిత్రం కథేమిటంటే...నీలం (సంగీత) తన భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్‌)కు దూరంగా ఉంటూ తన కూతురు నాజియా(బాంధవి శ్రీదర్)ను పెంచుకుంటూ ఉంటుంది. నీలం పక్కింట్లోనే ఉండే గోపీ (తీరువీర్) మంచి వాడే సాయపడే వాడే కానీ కాస్త భయస్థుడు. గోపీ తన సహోద్యోగి మినీ (కావ్యా కళ్యాణ్‌ రామ్)ను ప్రేమిస్తుంటాడు. నీలంకు గోపీ చేదోడువాదోడుగా ఉంటాడు. అలాంటి సమయంలో నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు గోపీ. దెయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలో గోపీకి ఎదురైన ఘటనలు ఏంటి?  మినీతో ప్రేమ వ్యవహారం ఏమవుతుంది?నీలం తన కూతురిని రక్షించుకుంటుందా? నాజియాకు దెయ్యం ఎందుకు పట్టింది? అసలు మసూద ఎవరు? మసూద నేపథ్యం ఏంటి? చివరకు గోపీ ఏం చేశాడు? ఈ కథలో పీర్ బాబా (శుభలేఖ సుధాకర్), అల్లాఉద్దీన్ (సత్యం రాజేష్‌) పాత్రలు ఏంటి? అన్నది  చూడాల్సిందే.

ఈ సినిమా గురించి నిర్మాత రాహుల్ యాదవ్‌ మాట్లాడుతూ, ‘మసూద’ ఫస్ట్ డే తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన టాక్‌తో రోజురోజుకు థియేటర్లు పెరిగాయి. స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఎంత చేస్తే అంత జనాల్లోకి ఆ సినిమా వెళుతుంది. మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉంటాయి కాబట్టి.. థియేటర్లకి ప్రేక్షకులు వస్తారు. కానీ ‘మసూద’ వంటి సినిమాలకు.. సినిమా బాగుంటే తప్పితే.. విడుదలకు ముందు ఎంత ప్రమోట్ చేసినా జనాలు పట్టించుకోరు. నేను సినిమా తీసే విధానంలో ఎంత జాగ్రత్త పడతానో.. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. 

సెకండాఫ్‌లో సాంగ్ గురించి కూడా కొందరు మాట్లాడారు. సినిమాకి గ్రాఫ్ ఉంటుంది. అది కొన్ని చోట్ల పడిపోవాలి. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ సినిమాలకు కూడా క్లైమాక్స్‌కి ముందు గ్రాఫ్ పడిపోతుంది. ఏ సినిమాకైనా అది ఉండాలి. ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్‌తో ఒక్కసారిగా గ్రాఫ్‌ లేస్తుంది. మూవీ తీసే గైడ్‌లైన్స్‌లో అది ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీశాము? అని నేను ఎప్పుడు ఆలోచించను. మంచి సినిమా తీయాలి. ఆ సినిమాతోనే లాభాలు ఆర్జించాలి. ఇదే నా ఫిలాసఫీ. మొదటి సినిమా నుంచి అదే ఫాలో అవుతున్నాను.

‘మసూద’ సినిమాకు మాత్రం టెక్నికల్‌గా అద్భుతంగా తీయాలని అనుకున్నాను. ఏం జరిగినా సరే.. నేను అనుకున్నది చేశాను. ఒక పొరిగింటి వ్యక్తికి మంచి టైటిల్ ఏమీ దొరకక ‘మసూద’ అని పెట్టాం. ఈ సినిమాకు సంబంధించి 200 డేస్ లొకేషన్స్‌కి స్పెండ్ చేశాం. మాములుగా అయితే ఒక హర్రర్ సినిమాకి ఒక గది చాలు. కానీ ఈ సినిమాలో బిగ్ కాన్వాస్ ఉంది. పీర్ బాబా లొకేషన్ ఒక్కటే తీసుకుంటే.. 6 డిఫరెంట్ ప్లేస్‌లలో తీశాం` అని న్నారు. 

ఇంకా చెబుతూ, మంచి కథ కుదిరితే.. నాని, నాగచైతన్య, శేష్, నవీన్ పోలిశెట్టి ఎవరితోనైనా సినిమా చేసే ఛాన్స్ ఉంది. కథ కుదిరిన టైమ్‌కి వారు బిజీగా ఉంటే.. వేరే హీరోతో చేయవచ్చు. అయితే తర్వాత సినిమాకు సంబంధించి.. ఇంకా ఏ కథ లాక్ చేయలేదు. నేను స్క్రిప్ట్ కూడా ఏదీ చదవలేదు. డిసెంబర్ 8తో మా బ్యానర్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ బ్యానర్‌ స్థాపించినప్పుడు అనుకున్నదానికంటే.. ఎక్కువే సాధించానని అనుకుంటున్నాను. మూడు సినిమాలు తీస్తాననిగానీ, ఆ మూడు సక్సెస్ అవుతాయనిగానీ, ముగ్గురు దర్శకులని పరిచయం చేస్తాననిగానీ, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాననిగానీ అనుకోలేదు. కానీ ఇవన్నీ జరిగాయి. అందుకే, నేను చాలా ఎక్కువే సాధించానని చెబుతాను` అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios