Asianet News TeluguAsianet News Telugu

హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ వీడ్కోలు, స్టార్ హీరో బ్రాడ్ పిట్ త్వరలో రిటైర్మెంట్

హాలీవుడ్ కు వీడ్కోలు పలుకబోతున్నాడు ఆస్కార్ విన్నర్.. స్టార్ హీరో బ్రాడ్ పిట్. హాలీవుడ్ లో గొప్ప గొప్ప నటుల సరసన చేరిన బ్రాడ్ పిట్ నిర్ణయంతో .. అంతా ఆశ్చర్యం వ్యాక్తం చేస్తున్నారు. 

Hollywood Star Rrad pitt talks about retirement
Author
Hyderabad, First Published Jun 24, 2022, 9:59 AM IST

బాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డుల విజేత.. బ్రాడ్ పిట్ త్వరలో తాను నటనకు వీడ్కోలు పలకనున్నట్టు ప్రకటించాడు. హాలీవుడ్ అగ్ర శ్రేణి నటుల్లోబ్రాడ్  పిట్ కూడా ఒకడు. తన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలు ఆయన చేశాడు. ఎన్నో సినిమాలకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. సినిమాల నుంచి త్వరలోనే రిటైర్మెంట్ తీసుకుంటానని తాజాగా ప్రకటించాడు. 


పరిశ్రమలో తన నటనకు సంబంధించి  ఇదే చివరి దశగా స్పష్టం చేశాడు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా బ్రాడ్ పిట్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నాకు తెలిసినంత వరకు నేను చివరి అడుగులో ఉన్నాను. ఇది చివరి సెమిస్టర్ లేదా ట్రిమిస్టర్ కావచ్చు ... అంటే ఆరు నెలలు లేదా మూడు నెలలు అని బ్రాడ్ పిట్ వివరించాడు.  రీసెంట్ గా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ సినిమాకు బ్రాడ్ పిట్ ఆస్కార్ అవార్డు అందుకోవడం గమనార్హం. 


హాలీవుడ్ స్టార్స్ ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్…. చాలా ఏళ్ల పాటు హాలీవుడ్లో ఆదర్శ దంపతుల్లా ఓ వెలుగు వెలిగారు. ఆరుగురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. హాలీవుడ్లో ఇతర సెలబ్రిల మాదిరిగానే వీరి సంసారం కూడా మధ్యలోనే వివిధ కారణాలతో ముక్కైలైంది. 2016లో ఈ స్టార్ కపుల్ విడిపోగా విడాకులు విషయంలో ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ కాలేదు. ఇద్దరి మధ్య ఆస్తుల పంపకంలో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం.. మరోవైపు బ్రాడ్ పిట్ మాజీ భార్య ఏంజెలినా జోలీతో న్యాయ వివాదాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇద్దరి భాగస్వామ్యంలో ఉన్న వైన్  వ్యాపారంలో జోలీ తన వాటాలను విక్రయించినందుకు.. బ్రాడ్ పిట్ కోర్టులో పిటిషన్ వేశాడు. అతడు నటించిన బుల్లెట్ ట్రైన్ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios