`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ప్రపంచ ఆడియెన్స్ మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హాలీవుడ్‌ స్టార్‌ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. `యాంట్ మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్ః క్వాన్టుమేనియా` మూవీ స్టార్‌ జోనాథన్‌ మేజర్స్.. `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ప్రపంచ ఆడియెన్స్ మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన స్టార్స్ సైతం ఈ సినిమాని ప్రశంసిస్తున్నారు. తాజాగా మరో హాలీవుడ్‌ స్టార్‌ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. `యాంట్ మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్ః క్వాన్టుమేనియా` మూవీ స్టార్‌ జోనాథన్‌ మేజర్స్.. `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం. ఈ సినిమా ఈ నెల 17న ఇండియాలోనూ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. 

తాను భారతీయ సినిమాకి పెద్ద అభిమానిని అని, `ఆర్‌ఆర్‌ఆర్‌` చూశానని చెప్పారు. అది తనకు బాగా నచ్చిందన్నారు. అంతేకాదు చాలా సార్లు ఈ చిత్రాన్ని చూశాను. ఇది మూడు గంటల నిడివి గల మూవీ కాబట్టి ఆ విషయం తెలిసింది. ఆ అనుభవాన్ని నేను ఆస్వాధించాను. ఇద్దరు నటులను తెరపై చూడటం బాగా నచ్చింది. వాళ్ల నటన చాలా బాగుందన్నారు. అంతేకాదు తాను భారతీయ సినిమాలను చూసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 

`యాంట్‌ మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్‌ః క్వాంటుమేనియా` మూవీ కి సంబంధించిన బుకింగ్స్ ఇండియాలో ప్రారంభమైన సందర్భంగా జోనాథన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జోనాథన్ మేజర్స్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు పెరుగుతున్న ప్రజాదరణ, అంతర్జాతీయ ప్రేక్షకులపై చూపుతున్న ప్రభావానికి నిదర్శనం. `యాంట్‌ మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్‌ః క్వాంటుమేనియా`మార్వెల్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనికి ఇండియాలోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ ఉంది. దీంతో ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్‌లో జోరు కొనసాగుతుంది. 

Marvel Studios India ఫిబ్రవరి 17, 2023న ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషలలో ఈ ఎపిక్, సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్‌ చిత్రాన్ని విడుదల చేస్తుంది. సూపర్-హీరో భాగస్వాములు స్కాట్ లాంగ్ (పాల్ రూడ్), హోప్ వాన్ డైన్ (ఇవాంజెలిన్ లిల్లీ) యాంట్-మ్యాన్, వాస్ప్‌గా తమ సాహసాలను మళ్లీ కొనసాగించబోతున్నారు.హోప్ తల్లిదండ్రులు హాంక్ పిమ్ (మైఖేల్ డగ్లస్), జానెట్ వాన్ డైన్ (మిచెల్ ఫైఫెర్)తో కలిసి, కుటుంబం క్వాంటం రాజ్యాన్ని అన్వేషించడం, వింత కొత్త జీవులతో సంభాషించడం, వారు అనుకున్న పరిమితికి మించి వాటిని సాహసం చేయడం వంటివి ఇందులో ప్రధానంగా ఉండబోతుందట. జోనాథన్ మేజర్స్ సాహసంలో కాంగ్‌గా చేరాడు. ఈ సినిమా కోసం దర్శకుడు పేటన్ రీడ్ , నిర్మాతలుగా కెవిన్ ఫీగే, స్టీఫెన్ బ్రౌసర్డ్ మమరోసారి కలవడం విశేషం. దీంతో సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ అంతర్జాతీయంగా సత్తా చాటుతుంది. విదేశాల్లో రికార్లు కలెక్షన్లు సాధించడంతోపాటు అవార్డు కొల్లగొడుతుంది. ఇప్పటికే `గోల్డెన్‌ గ్లోబ్‌` అవార్డు `నాటు నాటు` పాటకి వచ్చింది. అలాగే పలు ఫిల్మ్ క్రిటిక్‌ ఛాయిస్‌ పురస్కారాలు వచ్చాయి. ఇప్పుడు `నాటు నాటు` పాట ఏకంగా `ఆస్కార్‌`కి నామినేట్‌ అయ్యింది. అవార్డుపై టీమ్‌తోపాటు ఇండియన్‌ ఆడియెన్స్ ధీమాగా ఉన్నారు.