అర్జున్ రెడ్డితో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన రాహుల్ రామకృష్ణ లేని తెలుగు సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రస్తుతం  టాలీవుడ్‌లో  బిజీ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆయన ప్రతిభ హాలీవుడ్ ని కూడా ఆకర్షించింది. ఈ విషయాన్ని తానే  స్వయంగా తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా   తెలిపారు. ప్రదీప్ కాటసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిల్క్ రోడ్ అనే టీవీ సిరీస్ లో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ట్వీట్ చేస్తూ..

ఈ సందర్భంగా తాను.. ఈ న్యూస్ ఇంత త్వరగా బయటకు వస్తుందనుకోలేదు.. నా ప్రాజెక్ట్ కు సంబంధించి చిన్న స్నీక్ పీక్ ఇది… కష్టపడినందుకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నా అని ట్వీట్ లో తెలిపారు. 

ఇక త్వరలో తాను ప్రధాన పాత్రలో నటించిన మిఠాయి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది  రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. ఈ సినిమాకు డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ ‘ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు.