Asianet News TeluguAsianet News Telugu

మత్తు మందుతాగించి లైంగిక దాడి.. `ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌` డైరెక్టర్‌పై నటి లైంగిక ఆరోపణలు

`ఎక్స్ ఎక్స్‌ ఎక్స్` ఫేమ్‌ హాలీవుడ్‌ నటి ఏషియా ఆర్జెంటో సంచలన వ్యాఖ్యలు చేశారు. `ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌` ఫేమ్‌, ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు రాబ్‌ కొహెన్‌ తనని లైంగికంగా వేధించాడని, తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

hollywood actress asia argento accuses rob cohen of sexual assault arj
Author
Hyderabad, First Published Jan 26, 2021, 10:54 AM IST

`ఎక్స్ ఎక్స్‌ ఎక్స్` ఫేమ్‌ హాలీవుడ్‌ నటి ఏషియా ఆర్జెంటో సంచలన వ్యాఖ్యలు చేశారు. `ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌` ఫేమ్‌, ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు రాబ్‌ కొహెన్‌ తనని లైంగికంగా వేధించాడని, తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఆటోబయోగ్రఫీలో ఈ విషయాన్ని రాసుకున్నట్టు చెప్పారు. 2002లో రాబ్‌ కొహెన్‌ దర్శకత్వంలో రూపొందిన `త్రిబులెక్స్` సినిమాలో ఏషియా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సమయంలోనే ఇది జరిగిందని పేర్కొంది. 

``త్రిబులెక్స్`(ఎక్స్ ఎక్స్ ఎక్స్) సినిమా షూటింగ్‌ సమయంలో రాబ్‌ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. నాకు తెలియకుండా డ్రింక్‌లో మత్తు మందు కలిపి నాతో తాగించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తెల్లారి లేచి చూసేసరికి రాబ్‌ కొహెన్‌ బెడ్‌ రూమ్‌లో నగ్నంగా ఉన్నా. నాపై లైంగిక దాడి జరిగిందనే విషయం అర్థమైంది. ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నా ఆటోబయోగ్రఫీలో పొందుపరిచా` అని పేర్కొంది ఏషియా. ఆమె `అనాటమీ ఆఫ్‌ ఏ వైల్డ్ హార్ట్` పేరుతో తన ఆటోబయోగ్రఫీని రాసుకున్నారు. ఈ పుస్తకం ఈ వారంలో విడుదల చేయబోతుంది. 

ఇదిలా ఉంటే ఏషియా ఆరోపణలపై రాబ్‌ కొహెన్‌ ప్రతినిధులు స్పందించారు. `ఏషియా ఆరోపణలు అవాస్తవం. రాబ్‌ ఎప్పుడూ అలా చేయలేదు. ఆమెని మంచి స్నేహితురాలిగానే చూశాడు. ప్రొఫేషనల్‌గా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది` అని పేర్కొన్నారు. `త్రిబులెక్స్` సినిమా ఈ సిరీస్‌లో వచ్చిన తొలి సినిమా. దీంతోపాటు `ల్యాండ్‌ ఆఫ్‌ ది డెడ్‌`, `మ్యారీ ఆంటోనెట్టె`, `లెట్స్ నాట్‌ కీప్‌ ఇన్‌ టచ్‌`, `ట్రావెలింగ్‌ కంపానియన్‌` చిత్రాలతో పాపులర్‌ అయ్యింది. స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. 2017లో `మీటూ` మూవ్‌మెంట్‌కి తెరలేపింది. ఆ సమయంలో హాలీవుడ్‌ మేకర్‌ హార్వే వెస్టీన్‌పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో పెద్ద దుమారం లేపింది. ఇండియాకి కూడా `మీటూ` ఉద్యమం వ్యాపించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios