స్తంభించిన హాలీవుడ్.. సమ్మెకు దిగిన యాక్టర్స్.. 63 ఏళ్ల తర్వాత మరోసారి స్ట్రైక్

హాలీవుడ్ లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నెల రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తోంది. AI వినియోగం పట్ల తమకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలుపుతున్నారు. ఇక తాజాగా హాలీవుడ్ యాక్టర్స్ కూడా సమ్మెలో దిగారు. 
 

Hollywood  Actors are going on strike NSK

హాలీవుడ్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ద్వారా తమ కెరీర్ కు భరోసా లేదంటూ.. 12 వారాలుగా హాలీవుడ్ సినీ కళాకారులు సమ్మె బాట పట్టారు. హాలీవుడ్ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకి దిగి తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రముఖ స్టూడియోలు, నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో సమ్మెను మరింత ఉధృతం చేశారు. వీరి బాటలోనే హాలీవుడ్ యాక్టర్స్ కూడా నడుస్తున్నారు. గురువారం రాత్రి నుంచి Hollywood Actrors కూడా సమ్మెలోకి దిగారు. రైటర్స్ కు మద్దతుగా నిలిచారు. 

కొద్దిరోజులుగా పిక్కెట్ లైన్స్ లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నేతృత్వంలో ఈ సమ్మె కొనసాగుతోంది. మరోవైపు సీనియర్ యాక్టర్స్ గిల్డ్ (SAG)  కూడా ప్రస్తుతం స్ట్రైక్ లో యాక్టివ్ అయ్యింది.  రైటర్స్ డిమాండ్లను అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ ( AMPTP) ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో యాక్టర్స్ కూడా సమ్మె బాట పట్టారు. హాలీవుడ్ లోని  స్టార్ యాక్టర్స్ తో పాటు ఆల్మోస్ట్ యాక్టర్స్ మొత్తం నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రైక్ లోకి వచ్చారు. 

నిర్మాణ సంస్థలు, టీవీ షోలు, ఓటీటీలు మంచి లాభాలు ఆర్జిస్తున్నా రైటర్స్, కళాకారులకు సరైన వేతనాలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. పైగా కథల కోసం AI దగ్గరకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక తమకు హెల్త్ ఇన్సూరెన్స్, తదితర బెనిఫిట్స్ అందించడం లేదని, షూటింగ్ స్పాట్ లోనూ సరైన సదుపాయాలు లేవని అంటున్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. నిన్న రాత్రి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డిశ్చర్ స్టైక్ అనౌన్స్ చేయడంతో ప్రస్తుతం సమ్మె మరింత తీవ్రరూపంగా మారింది. ఇప్పటి నుంచి అన్ని షూటింగ్ లు, సినిమా ప్రమోషన్స్ ను కూడా నిలిపివేశారు. 

మొన్నటి దాకా రైటర్స్.. ఇప్పుడు యాక్టర్స్ కూడా సమ్మెకు దిగడంతో హాలీవుడ్ స్తంభించిపోయింది.  ప్రొడక్షన్ కంపెనీలు, స్ట్రీమింగ్ ఓటీటీలు, టీవీ సంస్థలకు కంటెంట్ పరంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే మరికొద్దిరోజుల్లో హాలీవుడ్ మూతపడే అవకాశమూ ఉందని అంటున్నారు. సమ్మె ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక 1980లో హాలీవుడ్ లో స్ట్రైక్ జరిగింది. 63 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈస్థాయిలో సమ్మె కొనసాగుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios