గత ఏడాది భాగమతి సినిమాతో బాక్స్ ఆఫీస్ కి కొత్త లెక్కలు చెప్పిన స్వీటీ అనుష్క మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. నెక్స్ట్ సినిమా కోసం సిద్దమవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు సంబందించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోన వెంకట్ నిర్మాతగా అనుష్క నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే స్వీటీ తో హాలీవుడ్ నటుడు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. కిల్ బిల్ యాక్టర్ మైకేల్ మడ్సన్ ప్రతినాయకుడిగా అనుష్క సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మేజర్ పార్ట్ మొత్తం అమెరికాలోనే షూట్ చేస్తారని సమాచారం. ఇక సినిమాకు మధుకర్ దర్శకత్వం వహించనుండగా మాధవన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ తో కలిసి కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని థ్రిల్లర్ అంశాలు ఆకట్టుకుంటాయని ఇటీవల కోన వెంకట్ తెలిపారు. త్వరలోనే సినిమాకు సంబందించిన టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.