ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, స్టాండప్‌ కమెడీయన్‌ డస్టిన్‌ డైమండ్‌(44) కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఫ్లోరిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. `సెవ్డ్‌ బై ది బెల్` అనే సీరియల్‌తో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్‌ స్టేజ్‌ 4 కణ క్యాన్సర్‌కు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ఆయన తండ్రి పేర్కొన్నారు.

 1989 నుంచి 1992 మధ్యకాలంలో వచ్చిన `సెవ్డ్‌ బై ది బెల్‌` సీరియల్‌లో డస్టీన్‌ బాల నటుడిగా అందరిని మెప్పించాడు.  డస్టిన్‌ తన స్కెచ్‌ ప్రతిభతో మంచి గుర్తింపు పొందాడు. అప్పట్లో ప్రముఖ ఛానల్‌ ఎన్‌బీసీలో ప్రతి రోజు శనివారం ఉదయం ప్రసారమయ్యే ఈ సీరియల్‌ అత్యంత ప్రేక్షక ఆదరణ పొందింది.

డస్టిన్‌ దర్శకుడు కూడా. ఆయన 2006లో `సెక్స్ టేప్‌` పేరుతో `స్క్రీన్డ్ సేవ్డ్ బై ది స్మెల్‌` అనే ఓ పోర్నోగ్రఫీ వీడియోని డైరెక్ట్ చేశారు. ఆయనలో స్టాండప్‌ కమెడీయన్‌ కూడా ఉన్నారు. అనేక కామెడీ షోస్‌ నిర్వహించారు. దాదాపు ముప్పై వరకు సీరియల్స్, అలాగే పలు సినిమాల్లో కూడా నటించారు. డస్టిన్‌ మృతితో హాలీవుడ్‌ సినీ ప్రముఖలు సంతాపం తెలియజేశారు. డస్టిన్‌ 2009లో తన ప్రియురాలు జెన్నీఫర్‌ మెస్నర్‌ని వివాహం చేసుకున్నారు. 2013లో విడిపోయారు.