చిత్ర పరిశ్రమలో జరుగుతున్న విషాదాలు అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటులు మృతి చెందినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా హాలీవుడ్ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

చిత్ర పరిశ్రమలో జరుగుతున్న విషాదాలు అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటులు మృతి చెందినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా హాలీవుడ్ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. యువ నటుడు కాడి లాంగో (34) ఊహించని విధంగా మరణించారు. 

తన ఇంట్లోనే లాంగో మరణించడం అందరిని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే లాంగో చాలా కాలంగా మద్యానికి బానిసయ్యాడు. లాంగో మరణించిన విషయాన్ని అతని మేనేజర్ అలెక్స్ ధృవీకరించారు. 

నా స్నేహితుడు కాడి ఇక లేరన్న వార్తని జీర్ణించుకోలేకున్నా. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మిస్ యు బ్రదర్ అంటూ అలెక్స్ పేర్కొన్నాడు. మద్యానికి బాగా లాంగో బానిసయ్యాడట. రిహాలిబిటేషన్ సెంటర్ కి తీసుకు వెళ్లినా లాభం లేకపోయింది. 

పిన్నవయసులోనే అతడి మరణానికి కారణం ఇదే అని అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. తన భర్త పిల్లల కోసం ఎంతో కష్టపడేవారు అని అతని భార్య స్టెఫానీ లాంగో తెలిపారు. లాంగో నాట్ టుడే, వైల్డ్ ఫ్లవర్ లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

Scroll to load tweet…