Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 30 కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్.. తారక్ కోసం రంగంలోకి దింపిన కోరటాల

తారక్ గ్లోబల్ స్టార్ అవతారం ఎత్తడంతో.. NTR30ని అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కించబోతున్నాడు కొరటాల శివ. దాని కోసం పక్కాగా ప్లాన్ చేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు. తారక్ కోసం ఇప్పటికే హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ ను దించాడు దర్శకుడు. 

Hollywood Action Choreographer Anne Bates For NTR30 JMS
Author
First Published Mar 26, 2023, 1:52 PM IST

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎన్టీఆర్30 సినిమాను సెక్ట్స్ ఎక్కించాడు తారక్. ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ రీసెంట్ గా ఓపెనింగ్ ను గ్రాండ్ గా జరుపుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్న ఈసినిమాను భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో... రూపొందించబోతున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. కొరటాల శివ ఈసినిమాను క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రూపొందిస్తున్నాడు. ముఖ్యంగా ఈసినిమాలో యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేత హౌరా అనిపిస్తాయట. 

దాని కోసం ఫస్ట్ షెడ్యూల్షూటింగ్ నుంచే ప్లాన్ చేసుతకుంటున్నాడు శివ. రీసెంట్ గా ఈసినిమాలో యాక్షన్ సీన్స్ కోసం.. ట్యాంకర్లలో డూప్ బ్లడ్ ను తీసుకెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది సోషల్ మీడియాలో.  ఇక ఇప్పుడు NTR30 కి సబంధించి మరో అప్ డేట్ తో మరోసారి అంచనాలు పెంచేశాడు కొరటాల శివ. ఇంతకీ ఈసినిమాకు సబంధించిన క్రేజీ అప్ డేట్ ఏంటీ అంటే..? 

 

 

ఆర్ఆర్ఆర్ లాంటి  ఇండస్ట్రీ హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న సినిమా కావడంతో ప్రతీ ఒక్కరిలోనూ NTR30పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కోసం కొరటాల శివ హాలీవుడ్‌ టెక్నీషియన్లను రంగంలోకి దింపనున్నాడు.అందులో భాగంగా ముందుగా  ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ సినిమాలో భాగం అయ్యాడు. ఆయన ఈసినిమా టీమ్ తో చర్చిస్తున్న ఓ వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. బేట్స్.. మిషన్‌ ఇంపాజిబుల్‌ లాంటి భారీ యాక్షన్ సీనిమాలకు పనిచేశారు. 

ఇక హాలీవుడ్ స్టార్ యక్షన్ కోరియోగ్రఫర్  ఈ సినిమాలో భాగం కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఎగ్‌జైట్‌ అవుతున్నారు. ఇక  ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐలాండ్ & పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈసినిమా కోసం రకరకాల ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా ఫిక్షన్ స్టోరీ కాకపోయినా.. సెమీ-పీరియడిక్ కథతో.. ఓ  ఐలాండ్‌లో సెటప్ చేసుకుని సినిమా సాగబోతున్నట్టు సమాచారం. మరి కోరటాల ఆచార్య సినిమాతో దెబ్బతిని ఉన్నాడు. ఈసారి ఈసినిమాను ఏంచేస్తాడో  చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios