యావరేజ్ టాక్ తో సినిమా రిలీజైనా కలెక్షన్స్ వైజ్ గా సినిమా బాగానే వర్కవుట్ అవ్వుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం. 


శైలేష్ డైరక్షన్ లో నాని, ప్రశాంతి కలిసి నిర్మించిన హిట్ సినిమా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు.ఇక ఇప్పుడు ఆ మూవీకి సీక్వల్ గా హిట్ 2 వచ్చింది.ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. యావరేజ్ టాక్ తో సినిమా రిలీజైనా కలెక్షన్స్ వైజ్ గా సినిమా బాగానే వర్కవుట్ అవ్వుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం.

HIT 2 ఆంధ్రా ,తెలంగాణాలలో రెండు రోజుల కలెక్షన్స్ షేర్ చూస్తే ఆ విషయం అర్దమవుతోంది.
👉Day 1: 4.03 కోట్లు
👉Day 2: 3.28 కోట్లు

ఆంధ్రా,తెలంగాణా:- 7.31 కోట్లు (11.90 కోట్లు~ గ్రాస్)

ఈ వీకెండ్ లో 90% థియేటర్ లో హోల్డ్ కనపడటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే మల్టిప్లెక్స్ లు ఉన్న రెవిన్యూ...బి,సి సెంటర్లలలో కనపడటం లేదు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ చేసింది.

👉నైజాం– 4.00కోట్లు
👉సీడెడ్ – 1.75కోట్లు
👉ఆంధ్రా – 4.50కోట్లు
మొత్తం ఆంధ్రా, తెలంగాణా కలిపి – 10.25కోట్లు
👉కర్ణాటక+భారత్ లో మిగతా ప్రాంతాలు – 1.50కోట్లు
👉ఓవర్ సీస్ - 2.50కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్ :- 14.25కోట్లు( బ్రేక్ ఈవెన్ – 15కోట్లు+)

గమనిక: భాక్సాఫీస్ డేటా....వివిధ సోర్స్ ల నుంచి సేకరించుకున్నది..అఫీషియల్ సమాచారం కాదు.

ఇక హిట్‌ 2లో రొటీన్ ట్విస్ట్ అయినా... స్క్రీన్ ప్లే బాగుంటుంది.హత్య చేసింది సీరియల్‌ కిల్లర్‌ అనే ముందే చెప్పారు. ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలనే చంపుతున్నారనేది సస్పెన్స్‌గా పెట్టారు. ఫస్టాఫ్‌ అంతా సింపుల్‌గా కొనసాగుతుంది. హీరో రొమాన్స్‌.. మధ్యలో కేసు విచారణ.. ఈక్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ నుంచి కథ పరుగులు పెట్టించటమే కలిసొచ్చింది.