Asianet News TeluguAsianet News Telugu

Hit2 : ‘హిట్ 2’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి.. ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?

బాక్సాఫీస్ వద్ద ‘హిట్ 2’ సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను  కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ రాబడుతున్న కలెక్షన్స్ పై తాజాగా అఫిషీయల్ అప్డేట్ అందింది.
 

Hit 2 Movie break even target completed and How much has it collected so far?
Author
First Published Dec 5, 2022, 2:41 PM IST

పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘హిట్ 2’ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా ‘హిట్ 2’ దుమ్ములేపుతోంది.  సాలిడ్ కలెక్షన్లను రాడుతోంది. 1000పైగా థియేటర్లలో రిలీజ్ అయి తొలిరోజు మంచి ఓపెన్సింగ్ ను దక్కించుకుంది. ఫస్ట్ డే రూ.11.6 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. రెండో రోజు రూ.7.75 కోట్ల గ్రాస్ రాగా.. మూడో రోజు రూ.8.8 కట్లు వసూల్ చేసినట్టు తెలుస్తోంది. 

చిత్రం రిలీజ్ కుముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.14 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ.15 కోట్లు వసూల్ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కేవలం మూడురోజుల్లోనే చేరుకున్నారు. ఈ మేరకు తాజాగా అఫిషీయల్ అప్డేట్ ను అందించారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా రూ.28.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిందన్నారు. దీంతో ఇకపై ‘హిట్ 2’ లాభాల బాట పట్టనుందని తెలిసిపోతోంది.

మరోవైపు యూఎస్ లోనూ ‘హిట్ 2’ కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతోంది. మౌత్ టాక్ తో ఆడియెన్స్ ను థియేటర్లకు వచ్చేలా చేశారు. దీంతో కేవలం రెండ్రోజులకే 800కే డాలర్లను వసూల్ చేసినట్టు మేకర్స్ తెలిపారు. సెకండ్ వీకెండ్ మొదలయ్యే వరకు 1 మిలియన్ డాలర్ నూ ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి పోటీగా మరే చిత్రం లేకపోవడంతో లాంగ్ రన్ లో థియేటర్లలో ఉండే అవకాశం ఉంది. 

‘మేజర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో అడివి శేష్  తాజాగా ‘హిట్ 2’తో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. అంతకముందుకు అడివి శేష్ నటించిన నాలుగు చిత్రాలు కూడా విజయవంతంగా నిలిచాయి. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ ఆరు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ‘హిట్ 2’ చిత్రానికి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించగా.. సైలేష్ కొలను దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఆడిపాడింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios