ఒక సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లాలంటే దానికి ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఇప్పుడున్న యువహీరోలు తమ సినిమాల ప్రమోషన్స్ కి సంబంధించి కొత్త పద్దతులు ఫాలో అవుతున్నారు. అయితే ఒక్కోసారి ఈ ప్రమోషన్స్ తేడా కొడుతూ ఉంటాయి. తాజాగా 'హిప్పీ' సినిమా విషయంలో ఇదే జరిగింది.

సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ చొక్కా విప్పేసి విన్యాసాలు చేశాడు. కుర్ర హీరో దూకుడు మీదున్నాడని అనుకుంటే తాజాగా మరో జిమ్మిక్కు చేశారు. హీరో కార్తికేయ, సీనియర్ నటుడు జేడి చక్రవర్తి ఓ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకి వెళ్లి వచ్చేస్తూ చిన్న డ్రామా చేశారు.

ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఒక ప్రశ్న అడగడం మర్చిపోయానంటూ.. హిప్పీ అంటే ఏంటని అడుగుతాడు. దానికి సమాధానం మాటలతో కాకుండా చేతలతో చెప్పమని అడుగుతాడు. దానికి కార్తికేయ షర్ట్ విప్పేసి పక్కన పడేసి తన బాడీ చూపిస్తూ ఇదే హిప్పీ అంటాడు. హీరో పక్కనున్న జేడి చక్రవర్తి తనకు అంత మంచి బాడీ లేదని సైగ చేస్తూ ఆపైన ప్యాంటు విప్పేసి విసిరేస్తాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అర్ధనగ్న దృశ్యాలు చూడడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ దరిద్రపు ప్రమోషన్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. సినిమా కూడా ఇలానే ఉంటుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.