ఈ మధ్యకాలంలో హిందీలోకి డబ్ అయ్యే తెలుగు సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని తెలుగు సినిమాలను ఎంపిక చేసుకొని వాటిని హిందీలోకి అనువదించి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ మిలియన్ల వ్యూస్ ని రాబడుతున్నారు.

గతంలో సరైనోడు, కవచం వంటి సినిమాలకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. తాజాగా వరుణ్ తేజ్ నటించిన 'కంచె' సినిమాను కూడా డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. 'కిలాడీ కీ జంగ్' అనే పేరుతో విడుదలైన ఈ సినిమాకి మూడు రోజుల్లో నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది.

రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ కావడంతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. డైరెక్టర్ క్రిష్ కావడం, ఆయనకి బాలీవుడ్ లో కాస్త గుర్తింపు ఉండడంతో ఈ సినిమా బాగా క్లిక్ అయింది. అయితే ఈ సినిమా చూసిన వారంతా క్రిష్ ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదే సమయంలో కంగనాని టార్గెట్ చేశారు. ఇలాంటి డైరెక్టర్ ని కంగనా  విమర్శించడంపై మండిపడుతున్నారు. ఆ విధంగా 'కంచె' సినిమా క్రిష్ కి బాలీవుడ్ లో మంచి పేరు తీసుకొస్తోంది. 'మణికర్ణిక' సినిమా సమయంలో రాని అప్లాజ్ ఈ సినిమాకి వస్తోంది.