తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలను హిందీలో డబ్ చేసి విడుదల చేస్తే విపరీతమైన వ్యూస్ వస్తుంటాయి. అయితే అన్ని సార్లు ఇలా జరగదు కానీ ఒక్కోసారి తెలుగు ఫ్లాప్ సినిమాలు యూట్యూబ్ లో వైరల్ అవుతుంటాయి.

పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో పెడితే 76 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. అల్లు అర్జున్ ఫ్లాప్ సినిమా 'దువ్వాడ జగన్నాథం'కి కూడా ఇదే రేంజ్ లో వ్యూస్ వచ్చాయి. సాయి ధరం తేజ్ నటించిన డిజాస్టర్ చిత్రం 'జవాన్'కి కూడా 36 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ వ్యూస్ చూసుకుంటూ ఆయా హీరోల అభిమానులు సంబర పడిపోతున్నారు. థియేటర్లలో ఫట్టు అయినా.. యూట్యూబ్ లో సినిమాలు హిట్లు అంటూ ఈ మిలియన్ వ్యూస్ పోస్టర్ లను షేర్ చేస్తున్నారు.

అయితే ఈ వ్యూస్ కారణంగా హీరోలకు వచ్చే లాభం ఏం ఉండదు. ఎటొచ్చీ ఈ వ్యూస్ కారణంగా కాసిన్ని డబ్బులు మాత్రం సంపాదించుకుంటున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు.