హిందీ నటుడు, దర్శకుడు తారిఖ్‌ షా మృతి చెందారు. కొంత కాలంగా న్యూమోనియా, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

హిందీ నటుడు, దర్శకుడు తారిఖ్‌ షా మృతి చెందారు. కొంత కాలంగా న్యూమోనియా, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తారిఖ్‌ షా ప్రముఖ టీవీ నటి షోమా ఆనంద్‌కి భర్త. `బాహర్‌ ఆనే తఖ`, `గుమ్నామ్‌ మై కోయ్‌`, `ముంబయి సెంట్రల్‌` వంటి చిత్రాల్లో నటించాడు తారిఖ్‌ షా. 

ఓ వైపు నటుడిగా రాణిస్తూనే `జనమ్‌ కుండ్లీ` అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో వినోద్‌ ఖన్నా, జితేంద్రా, రినా రాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ వంటి భారీ తారాగణం నటించడం విశేషం. ఇది మంచి విజయం సాధించింది. అలాగే `కడ్వా సచ్‌‌` చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే తారిఖ్‌ షా, నటి షోమా ఆనంద్‌ 1987లో వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు సారా షా ఉంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Scroll to load tweet…