బిగ్ బాస్ సీజన్ 3 షోలో మొదటి నుండి ఏదొక వివాదం చోటుచేసుకుంటూనే ఉంది. తమన్నా హౌస్ లో ఉన్నంత కాలం రవిని టార్గెట్ చేస్తూ తెగ రచ్చ చేసింది. ఆమె ఎలిమినేట్ అయిన తరువాత కాస్త గొడవలు తగ్గుతాయేమో అనుకుంటే రోజురోజుకి మరింత ఎక్కువ అవుతున్నాయి.

ఇప్పటికే హౌస్ అలీ, మహేష్ ల మధ్య గొడవ జరుగుతుంది. ఇది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో హిమజ రూపంలో మరో వివాదం మొదలైంది. ఈరోజు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ కి సంబంధించి ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో హిమజ చేసిన రచ్చ మాములుగా లేదు.

హిమజ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆమ్లెట్ తింటున్న సమయంలో బాబా భాస్కర్ తో పాటు కొందరు కంటెస్టంట్స్ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. తింటున్న సమయంలో తనపై కామెంట్ చేయడంతో మండిపడ్డ హిమజ వెంటనే ఆమ్లెట్ ని డస్ట్ బిన్ లో వేసి తన కోపాన్ని ప్రదర్శించింది. అంతటితో ఆగకుండా కిచెన్ లోకి వెళ్లి గుడ్లన్నింటినీ పగలగొడుతుంది.

నేను తినలేదు కాబట్టి ఎవరూ తినడానికి వీలులేదంటూ గట్టిగా అరిచి మరీ చెప్పింది. ఆమె ప్రవర్తనతో హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. హిమజకి నిజంగానే కోపం వచ్చిందా..? లేక బిగ్ బాస్ ఆమెకి ఏమైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చారా..? అనే విషయాలు ఈరోజు ఎపిసోడ్ లో తెలియనున్నాయి.