నేను కూడా శ్రీరెడ్డి లాగే చేస్తా.. ఏం చేయగలరు మీరు..? (వీడియో)

నేను కూడా శ్రీరెడ్డి లాగే చేస్తా.. ఏం చేయగలరు మీరు..? (వీడియో)

                                              

శ్రీరెడ్డి నిన్న(శనివారం) ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థ నగ్నంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అదే బాటలో ఓ ట్రాన్స్ జెండర్ కూడా నేను శ్రీరెడ్డి బాటలోనే నడుస్తాను అంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసింది. దానిని శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ పేజిలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను ఓ ట్రాన్స్ జెండర్‌ అని.. అవకాశాలు ఇవ్వకుంటే శ్రీరెడ్డిలాగే తను కూడా ఫిలిం ఛాంబర్ ఎదుట బట్టలు విప్పుకుని.. ఛాంబర్ అంతా తిరిగి.. మీడియా ఎదుట నిప్పుతో కాల్చుకుని చనిపోతానని వెల్లడించింది. దీనికి శ్రీరెడ్డి ‘‘నీవు చనిపోవాల్సిన అవసరం లేదు. మనిద్దరం కలిసి పోరాడుదాం. నువ్వు ట్రాన్స్‌జెండర్ అయితే ఏంటి.. నువ్వొక హ్యూమన్ బీయింగ్. టాలీవుడ్‌లో నీకు అవకాశం వస్తుంది’’ అంటూ ఆ వీడియోని తన ఫేస్‌బుక్ పేజిలో పోస్ట్ చేసింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos