ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో  మహేష్‌ బాబు చేస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’.షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తైన ఈ చిత్రం లో  హైలెట్ గా నిలిచే సీన్ గురించి ఇప్పుడు మీడియాలో టాక్ మొదలైంది. అందుతున్న సమాచారం మేరకు..భరత్ అనే నేను తరహాలో ఈ సినిమాలో మీడియాని టార్గెట్ చేస్తూ ఓ డైలాగుతో కూడిన సన్నివేశం రాసారుట. కథలో భాగంగా మహేష్ దగ్గరకు మీడియా వస్తుంది. 

మహేష్  అప్పుడు  పొలంలో ఉంటాడు. అక్కడ నుంచే  మాట్లాడతాడు. ఆ సీన్ లో ...మీడియా సెలబ్రెటీలను,వారి జీవితాలను హైలెట్ చేయటంలో బిజిగా ఉందని, పంట పండించి అందరి మనందరికి ఆహారం అందించే రైతును, అతని జీవితాన్ని పట్టించుకోదని సున్నితంగా చురకలు వేస్తాడట. ఈ సీన్ కు,డైలాగ్స్ కు  అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట. సినిమా సారాంశం మొత్తం ఆ ఒక్క సీన్ లో చెప్పేస్తారట. 

ఇక  సినిమా రైతులు సమస్యలను ప్రతిబింబిస్తుందని, మాస్ సినిమాలా ఉండదని చెప్తున్నారు. ముఖ్యంగా అల్లరి నరేష్, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సెకండాఫ్ లో అదిరిపోతాయని చెప్తున్నారు. 

అలాగే  చిత్రంలో కీలకమైన కాలేజీ ఎపిసోడ్‌లను డెహ్రాడూన్‌లో, ఇండ్రస్టిలియస్ట్ గా మహేష్ కనిపించే ఎపిసోడ్‌లను అమెరికాలో షూట్ చేశారు. ఇక ముఖ్యమైన సెకండాఫ్ ఎమోషనల్  సీన్లు అన్నింటినీ గ్రామీణ నేపథ్యంలో షూట్ చేసారు. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.