వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి గుడ్‌న్యూస్‌ చెప్పింది హైకోర్ట్. తన సినిమా `మర్డర్‌`పై ఉన్న స్టేని కొట్టేసింది. ప్రణయ్‌, అమృత, మారుతీరావు పేర్లని, ఫోటోలను వాడకుండా సినిమా విడుదల చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది హైకోర్ట్.  

`మర్డర్‌` సినిమా విడుదలకు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి గుడ్‌న్యూస్‌ చెప్పింది హైకోర్ట్. తన సినిమా `మర్డర్‌`పై ఉన్న స్టేని కొట్టేసింది. ప్రణయ్‌, అమృత, మారుతీరావు పేర్లని, ఫోటోలను వాడకుండా సినిమా విడుదల చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది హైకోర్ట్. 

 నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వర్మ `మర్డర్‌` పేరుతో సినిమాని తెరకెక్కించారు. మారుతీరావు కోణంలో, ఆయన హత్య చేయించింది తప్పు కాదనే కోణంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రణయ్‌ భార్య, మారుతీరావు కూతురుతోపాటు మరికొందరు ఈ సినిమాని నిలిపివేయాలని పిటిషన్‌ వేయగా, నల్గొండ కోర్ట్ సినిమా విడుదలై స్టే విధించింది. 

దీనిపై వర్మ టీమ్‌ నల్గొండ కోర్ట్ తీర్పుని సవాల్‌ చేస్తూ హైకోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న హైకోర్ట్ `మర్డర్‌` సినిమాపై ఉన్న స్టేని కొట్టేసింది. ప్రణయ్‌, అమృత, మారుతీరావు పేర్లని, ఫోటోలను వాడకుండా సినిమాతీసి విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమా తీసిన మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న కోర్ట్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Scroll to load tweet…