వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' నుంచి లిరికల్ సాంగ్.. సుతి మెత్తనైన స్టెప్పులతో గుండెల్లో గుచ్చుతున్న శ్రీలీల
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కలసి నిర్మిస్తున్న చిత్రం ఆది కేశవ. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కలసి నిర్మిస్తున్న చిత్రం ఆది కేశవ. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
ముఖ్యంగా శ్రీలీల, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నవంబర్ లో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి బ్రీజీ లిరికల్ సాంగ్ వచ్చింది. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
బుజ్జి బంగారం అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల మధ్య క్యూట్ రొమాన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా శ్రీలీల డ్యాన్సింగ్ స్కిల్స్ తో అదరగొడుతోంది.
సుతిమెత్తగా తన స్టెప్పులతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోంది శ్రీలీల. ఇద్దరూ పర్ఫెక్ట్ సింక్ లో డ్యాన్స్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించారు. లిరిక్స్, సంగీతం వినసొంపుగా ఉండడంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో నెటిజన్లని ఆకట్టుకుంటోంది.